👉 మే ఒకటి నుండి జూలై 15 వరకు కొనసాగనున్నది.
J. SURENDER KUMAR,
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపి లకు మాత్రమే మే 1 నుండి జూలై 15 వరకు బ్రేక్ దర్శనాలు పరిమితం చేస్తూ టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం టిటిడి మే ఒకటి నుండి పలు కీలక నిర్ణయాలు అమలు చేయనుంది.
వేసవి సెలవుల నేపథ్యంలో ఇప్పటికే తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించడంలో భాగంగా మే 0 మే 1 నుండి జూలై 15 ను వరకు, వీఐపీ బ్రేక్ దర్శనాలు కేవలం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే టీటీడీ పరిమితం చేయనుంది.
అదేవిధంగా మే1 నుండి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రయోగాత్మకంగా ఉదయం 6 గంటల నుండి అమలు చేయనుంది. ఈ మేరకు టీటీడీ జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది.