ఉగ్ర దాడి అమానుషం బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలి !

👉 మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !


J. SURENDER KUMAR,


పర్యాటకుల పై పాకిస్తాన్ ముష్కరుల ఉగ్ర దాడి అమానుషమని, ఈ దారుణ సంఘటన తీవ్రంగా ఖండిస్తూ, సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు కోటి రూపాయలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ టీ .జీవన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


పర్యాటకులపై దాడికి పాల్పడినట్లు ప్రకటించుకున్న ఉగ్ర మూఠాను ఉపేక్షించవద్దని 28మంది మృతికి కారణమైన ఉగ్రవాదులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే సర్జికల్ స్ట్రైక్ చేపట్టాలని జీవన్ రెడ్డి ప్రకటనలో డిమాండ్ చేశారు
.