ఉగ్రవాదుల మరణ హోమం లో సయ్యద్ సమిద అయ్యాడు !

👉 ఉగ్రవాదులను అడ్డుకుంటే నే ఆదిల్ ను హతమార్చారు !


J.SURENDER KUMAR,


మంగళవారం పహల్గామ్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో కాశ్మీర్ యువకుడు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా సమిధ అయ్యాడు.


అమాయక పర్యటకులను ఎందుకు చంపుతున్నారు ?  అంటూ ఉగ్రవాదులను అడ్డుకుంటేనే విధి లేని పరిస్థితుల్లో వారు తమ మతం కు చెందిన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా  చంపి ఉంటారనేది అక్షర సత్యం.


సంఘటన స్థలంలో, ప్రత్యక్ష సాక్షులు లేరు,  కానీ తమ వారిని ఉగ్రవాదులు తమ కళ్ళ ఎదుటే  కాల్చి చంపుతూ, వీరు హిందువులా ? ఇతర మతస్తులా ? అంటూ నిర్ధారించుకొని  చంపినట్టు బాధిత కుటుంబ సభ్యులు గుండెలు అవిసెల రోధిస్తూ సంఘటన తీరుతున్నలు వివరిస్తున్నారు. ఉగ్రవాదులు, కొందరి లోదుస్తులు విప్పించి ముర్మాంగాలను చూసి  నిర్ధారించుకుని హతమార్చిన విషయం తెలిసిందే .

👉 వివరాల్లోకి వెళితే..

సయ్యద్ ఆదిల హుస్సేన్ ( ఫైల్ ఫోటో)

పహల్గామ్‌లో స్థానిక పోనీ వాలా సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా 20 ఏళ్ల వయసు, ఉగ్రవాదులు పర్యటకుల పై  కాల్పులు జరుగుతున్న సమయంలో వారిని అడ్డుకొని ఒకరి రైఫిల్స్‌ను లాక్కోవడానికి ప్రయత్నించాడు.

కాలినడకన మాత్రమే చేరుకోగల  బైసారన్ ప్రాంతానికి పర్యటకులను గుర్రపు స్వారీ చేయిస్తూ ఆదిల్ హుస్సేన్  తన  జీవనం కొనసాగిస్తున్నాడు.


అనంతనాగ్‌ జిల్లా  హపత్నార్ గ్రామానికి చెందిన గుజ్జర్ దంపతుల ముగ్గురు పిల్లలలో ఆదిల్ పెద్దవాడు .


తమ్ముడు నౌషాద్ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆదిల్ ఇంటికి  వచ్చాడని, మంగళవారం నాడు పహల్గామ్‌కు వెళ్లాడని, ఆ రోజు దాడి జరిగిందని అన్నారు. అని నౌషాద్ అన్నారు.


“దాడి తర్వాత పర్యాటకులు ప్రాణాల కోసం పరిగెడుతున్నప్పుడు, ఉగ్రవాదులు వారిని వెంటాడుతున్న సమయంలో సయ్యద్ అదిల్, అమాయకులను ఎందుకు చంపుతున్నారని ఓ ఉగ్రవాదిని అడ్డుకొని అతడి చేతిలో ఆయుధం లాక్కొని ప్రతిఘటిస్తున్న సందర్భంలో తన అన్నను కాల్చి చంపారు అని నౌషద్ రోధిస్తూ కాశ్మీర్ లో మీడియా  చానల్స్ కు  వివరించాడు.


మత పిచ్చి మదం తలకెక్కిన పాకిస్తాన్ ఉగ్రవాదులు, మంగళవారం   పర్యటకులను, ఆధార్ కార్డులు, పేర్లు పరిశీలిస్తూ, ఖురాన్ లో శ్లోకాలను చదవాలంటూ  కేవలం హిందూ పర్యాటకులను సెలెక్ట్ అండ్  ఎలెక్ట్  పద్ధతిలో 28 మందిని కాల్చి చంపిన ఉగ్రవాదులు, పదే పదే తమను అడ్డుకుంటున్న , తమ మతానికి చెందిన సయ్యద్  ఆదిల్ హుస్సేన్ ను హతమార్చింది వాస్తవం.


ఉగ్రవాదులు జరిపిన మారణ హోమం, మృతి చెందిన పర్యాటకుల కుటుంబ సభ్యులు రోదిస్తూ వివరించిన విషయాలు పరిశీలిస్తే ఓ ఉగ్రవాదిని సయ్యద్ ఆదిల్ అడ్డుకున్నది అనే అంశం నిజమే కావచ్చు.

👉 ఆదిల్ అంత్యక్రియలో కాశ్మీర్ సీఎం !

బుధవారం జరిగిన సయ్యద్ హుస్సేన్ అంతక్రియలలో ప్రార్థనలు.

బుధవారం జరిగిన ఆదిల్ అంత్యక్రియల ప్రార్థనల లో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. కుటుంబానికి అన్ని విధాలా మద్దతు ఉంటానని హామీ ఇచ్చారు. “బహుశా ఉగ్రవాదిని అడ్డుకొని. తుపాకీ లాక్కునే ప్రయత్నంలో అందుకే అతన్ని లక్ష్యంగా చేసుకున్నారు”  కాబోలు అని సీఎం అబ్దుల్లా విలేకరులతో అన్నారు..


ఆదిల్ తండ్రి సయ్యద్ హైదర్ షా తన కొడుకు మరణ వార్తను గుర్తు చేసుకున్నారు. “దాడి గురించి తెలిసి, నేను ఆదిల్ హుస్సేన్ కు ఫోన్ చేశాను కానీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది.

సాయంత్రం 4  గంటలకు, అతని ఫోన్ ఆన్ రింగ్ అయింది కానీ ఎవరూ సమాధానం చెప్పలేదు. మేము పోలీస్ స్టేషన్‌కు పరుగెత్తాము,  అప్పుడే  తెలిసింది. నా కొడుకు ఉగ్రవాదుల తుపాకీ తూటాలకు బలి అయ్యాడని అన్నారు.


హత్యకు గురైన ఆదిల్ తల్లిదండ్రులు వృద్ధులు వారికి ఆదిలే ఏకైక ఆసరా.   జీవనోపాధి కోసం గుర్రాలపై పర్యటకులతో స్వారీ చేయిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.  ఉగ్రవాదుల మతం మదం లో మానవత్వం విజయం సాధించకపోవచ్చు, మతం కన్నా మానవత్వమే గొప్ప అనేది సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా మరణం  చరిత్ర పూటలలో స్థానం సంపాదించింది అని చెప్పుకోవచ్చు.