J.SURENDER KUMAR,
జమ్ముకశ్మీర్ లో మంగళవారం పర్యటకులపై
జరిగిన ఉగ్రదాడి ఘటనలో మృతి చెందిన
26 మందిలో ఓ ముస్లిం వ్యక్తి ఉన్నాడు.
గురి తప్పి తూటా తగిలిందా ?
కాల్పులను అడ్డుకుంటే కాల్చి చంపారా ?
అనే అంశం లో స్పష్టత లేదు.
ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన 26 మంది పేర్లు, ప్రాంతాల, వివరాలతో అధికార యంత్రాంగం విడుదల చేసిన ప్రకటనలో రెండవ వ్యక్తి ముస్లిం ఉన్నాడు.
సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా, తండ్రి పేరు సయ్యద్ హైదర్ షా, పహల్గామ్ తాలూకాలోని గ్రామానికి చెందిన వాడుగా పేర్కొన్నారు.

👉 గాయపడిన 17 మందిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని ప్రకటంలో పేర్కొన్నారు.
4 ప్రత్యేక విమానాల్లో మృతదేహాలను క్షతగాత్రులను వారి స్వస్థలకు లకు యంత్రాంగం తరలించనున్నారు..
👉 మృతి చెందిన 26 మంది వివరాలు,.
సుశీల్ ( ఇండోర్ ) సయ్యద్ అదిల్ హుస్సేన్ షా ( పహల్గామ్) హేమంత్ జోషి ( తమిళ ముంబై) వినాయక్ నెట్వర్క్ ( హర్యానా) అతుల్ శ్రీకాంత్ మోని ( డోంగ్వెళ్లి వేస్ట్ ) నీరజ్ ఉద్వానీ (ఉత్తరాఖండ్) బిషన్ అధికారి ( కోల్కత్తా ) సుదీప్ ద్వివేది (ఉత్తర ప్రదేశ్) ప్రశాంత్ కుమార్ స్థపతి ( ఒడిస్సా) మనీష్ రాజన్ ( బీహార్ ఎక్సైజ్ అధికారి ) ఎన్ రామచంద్రన్ ( కేరళ ) సంజయ్ లక్ష్మణ్ లాలి ( ముంబై) దినేష్ అగ్రవాల్ ( చండీగఢ్) సమీర్ గుహార్ ( కోల్కత్తా) చంద్రమౌళి ( విశాఖపట్నం) మధుసూదన్ సోంశెట్టి ( బెంగళూరు ) సంతోష్ జగ్గర్ ( పూణే) మంజునాథ్ రావు ( కర్ణాటక) కౌస్తుభవ్ గన్నెట్టి ( పూణే ) భరత్ భూషణ్ ( బెంగళూరు) సుమిత్ ( గుజరాత్) త్యాగలింగ్ (అరుణాచల్ ప్రదేశ్) శైలేష్ భాయ్ ( గుజరాత్)
👉 గాయపడిన 17 మందిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి

ధోబి వినోబాబేకు బుల్లెట్ గాయాలు, డాక్టర్ ఏ పరమేశ్వర్ కడుపులో బుల్లెట్ గాయం, శశి కుమార్ నాయక్, భుజం కు బుల్లెట్ గాయం, శాంతనన్ అపస్మారక స్థితి, శోభేద్ పాటిల్, మెడపై బుల్లెట్ గాయం, వినయ్ భాయ్ కుడి భుజం బుల్లెట్ గాయం మిగతా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రకటనలో పేర్కొన్నారు.

👉 జల్లాడే పడుతున్న భద్రతా దళాలు !
హోం మంత్రి అమిత్ షా హుటాహుటిన మంగళవారం జమ్ము కాశ్మీర్ కు చేరుకొని గవర్నర్ భవనంలో అధికార యంత్రాంగం తో దాడి సంఘటనపై సమీక్ష నిర్వహించారు. భద్రత బలగాలు దాడి జరిగిన ప్రాంత పరిసరాలు గాలిస్తూ జల్లెడ పడుతున్నారు. సాటిలైట్, రాడార్, తదితర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సైన్య విభాగం నిశితంగా సంఘటన జరిగిన తీరును అంచనా వేస్తున్నారు.
