ఉగ్రవాదుల దాడి లో మృతులకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సంతాపం !

J.SURENDER KUMAR,

జమ్ము కశ్మీర్ పహల్గామ్‌లో అమాయకులైన పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి  పలువురు మంత్రివర్గ సహచరులతో నిర్వహించిన సమావేశం ఉగ్రవాదుల దాడులను ఖండించింది.


ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దామోదర రాజనర్సింహ , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , జూపల్లి కృష్ణారావు, ధనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి , పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇతర ప్రతినిధులతో జరిగిన సమావేశం ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

👉 పోలీస్ శాఖను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి !

ఇండియా జస్టిస్ రిపోర్ట్ – 2025 లో తెలంగాణ పోలీస్ శాఖ దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క , మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  పోలీసు అధికారులను అభినందించారు.


రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి , రాష్ట్ర డీజీపీ జితేందర్ , ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి  కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి ని కలిసి ఇండియా జస్టిస్ రిపోర్ట్‌లోని అంశాలను వివరించారు.