యువతకు జగ్జీవన్ రామ్ జీవితం మార్గదర్శకం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


నేటి యువత కు జగ్జీవన్ రామ్ జీవితం మార్గదర్శకం కావాలి అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
మాజీ ఉప ప్రధాని డా.బాబు జగ్జీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా శనివారం  ధర్మపురి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో  ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్  పాల్గొన్నారు.


ఈ సందర్భంగా డా.బాబు జగ్జీవన్ రామ్  చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.
డా.బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని, షెడ్యూల్డ్ కులాల వంటి అణగారిన వర్గాల హక్కుల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషి చేసి దళిత ఐకాన్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


👉 జగిత్యాలలో…


జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన డా.బాబు జగ్జీవన్ రామ్  జయంతి వేడుకల్లో  ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డా.బాబు జగ్జీవన్ రామ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.