అధైర్య పడకండి ఆదుకుంటా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


👉 గొర్రెల యజమానులతో ఎమ్మెల్యే..


J.SURENDER KUMAR,


మీకు జరిగిన లక్షలాది రూపాయల అపార నష్టం బాధాకరం మీరు అధైర్య పడకండి మీకు అండగా ఉంటా మీ గొర్రెల ఆకస్మిక మృతి చెందడం పట్ల ప్రభుత్వంతో మాట్లాడి మిమ్మల్ని ఆదుకుంటాను అని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్అ డ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు


ధర్మారం మండలం  బొమ్మారెడ్డి పల్లె గ్రామానికి చెందిన కొమ్మ రాజేశం, కొమ్మ కనుకయ్య, సమ్మెట కొమురయ్య, రేచవేణి మల్లేశం, దాడి నాగయ్యలకు చెందిన సుమారు 6 వందల గొర్రెలు  గ్రామ శివారులో మేతకు  ప్రమాదవశాత్తూ విషపు ఆహారం తిని సుమారు 96 గొర్రెలు ఆదివారం  మృతి చెందాయి.


ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గ్రామానికి చేరుకొని గొర్రెల యజమానులను సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారిని పరామర్శించి ఓదార్చారు. 


వారి సమక్షంలో జిల్లా కలెక్టర్ , పశు వైద్యాధికారులతో  మాట్లాడారు.  ప్రభుత్వ పక్షాన ఆర్థిక సహాయాన్నీ అందించే విధంగా కృషి చేస్తానని  హామీ ఇచ్చారు.


ఎమ్మెల్యే  వెంట అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.