ఏఐసిసి ఇచ్చిన ఆదేశాల మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తా !


👉 జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో..

👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పార్టీ బలోపేతం కోసం ఎలాంటి ఆదేశాలు ఇచ్చిన ఆదేశాల మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తానని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అన్నారు


జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక AB కన్వెన్షన్ హాల్ లో బుధవారం  జరిగిన జిల్లాస్థాయి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది.  మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగ రావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మీ,  మరియు జిల్లా ఎస్సీ, బీసీ, కిసాన్ సెల్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లా పరిశీలకు అంజన్ కుమార్  మరియు కత్తి వెంకటస్వామి లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం మరియు పార్టీ రాష్ట్రంలో చేపడుతున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు గ్రామ మండల బ్లాక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక కొరకు విధి విధానాల ప్రకటన తదితర అంశాలపై చర్చించారు.


👉 అనంతరం  ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృధి పథకాల ఫలాలు ప్రతి గడప గడపకు చేరవేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త పై ఉందన్నారు.


పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తించి వారికి అండగా ఉంటామని, పార్టీ పదవుల విషయంలో కూడా పార్టీ గెలుపు కోరకు కష్టపడిన వారికి మొదట ప్రాధాన్యత ఉంటుందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా  అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీనీ గెలిపించే విధంగా కార్యకర్తలు నాయకులు కష్టపడాలని, అన్నారు.


ఏమైనా లోపాలు ఉన్న మా దృష్టికి, అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్  అధ్యక్షతన పార్టీ  ముందు వివరించడం జరుగుతుందన్నారు .


రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మనకు అప్పజెప్పినప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ అప్పుల రాష్ట్రాన్ని మరల ఆర్థిక పరంగా గాడిలో పెడుతూ ముందుకు వెళ్లడం జరుగుతుందని, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.


నాకు 2018 సంవత్సరంలో పార్టీ టికెట్ ఇవ్వడం కష్టం అని తెలిసినప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి  నాకు టికెట్ ఇవ్వకుంటే తనకు కూడా టికెట్ ఇవ్వవద్దని చెప్పి నాకు పార్టీ టికెట్ ఇప్పించడం జరిగిందని, అలాంటి జీవన్ రెడ్డి ని గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పై ఉందన్నారు.


బిఆర్ఎస్ ప్రభుత్వంలో  కొప్పుల ఈశ్వర్ ధర్మపురీ నియోజకవర్గ కార్యకర్తల పై అక్రమ కేసులు పెట్టీ ఇబ్బందులకు గురి చేయడం జరిగిందని, అలాంటి పరిస్థితుల నుండి ఈ రోజు పార్టీ అధికారంలోకి తెచ్చుకోవడం జరిగిందన్నారు.


కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ఉన్న ఎవ్వరు తొందర పడవద్దని కొంత సమన్వయం పాటించాలని, ప్రతి కార్యకర్త కష్టసుఖాల్లో మేము వారికి అండగా ఉంటామని, త్వరలోనే ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రతి కార్యకర్త కష్టసుఖాలు తెలుసుకుంటామని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తెలిపారు.