అమ్మకం,కొనుగోలు దారులకు అనుకూలంగా మార్కెట్ !

👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,


ధర్మపురి పట్టణ పరిధిలో  కూరగాయల, మాంసం అమ్మకం దారులకు, కొనుగోలుదారులకు  అనుకూలంగా మార్కెట్ ఉండేలా చర్యలు చేపట్టాలని, ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అధికారులను ఆదేశించారు.


ధర్మపురి పట్టణంలోని వేజ్ , నాన్ వెజ్ సమీకృత మార్కెట్ సముదాయాన్ని , అమృత్ స్కిం కింద నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ ను శనివారం  ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు.


👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…


👉 గత ప్రభుత్వ పాలకులు వెజ్ ,  నాన్ వెజ్ మార్కెట్ సముదాయాన్ని ₹ 5 కోట్లతో నిర్మాణం చేపట్టాం అని ₹ 3 కోట్లతో షెడ్ లు,  ₹ 2 కోట్లతో గద్దెల నిర్మించినట్టు చెప్పిన పాలకులు,  మార్కెట్ సముదాయాన్ని ఎంత మంది  వినియోగించుకుంటున్నారో ?  తెలుసుకోవాలని, ఆరోపించారు.


👉 ఇబ్బందికరంగా మారిన మార్కెట్ లోని  సిమెంట్ గద్దెలను  తొలగించడానికి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తో చర్చించి పరిస్థితి వివరించినట్టు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు అన్నాడు.   అధికారులతో చర్చించి, ప్రజల అభిప్రాయానికి అనుకూలంగా గద్దె లు కూల్చాలని వివరించినట్టు తెలిపారు.


👉 గత పాలకుల ఈ ప్రాంత ప్రజలకు త్రాగునీరు అందించే విషయంలో పూర్తిగా విఫలం చెందారు అని ఆరోపించారు.


👉 మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం త్రాగు నీటి కోసం ₹ 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు   ప్రభుత్వంలో పాలకులు త్రాగు నీటి సరఫరా గురించి శాశ్వత పరిష్కారం చూపలేదని, ఈ  ప్రాంత ప్రజలుత్రాగు నీటి కొరకు డబ్బా నీటిపై ఆధారపడాల్సి వస్తుందని, ప్రత్యామ్నాయంగా  బోల్ చెరువు నుండి నీటిని అందించే విధంగా చర్యలు చేపట్టేమని ఎమ్మెల్యే అన్నారు.


👉 అమృత్ పథకం  ద్వారా జ్వరం పై పటానికి శాశ్వత తాగునీటి సౌకర్యం  కలుగుతుందని ఎమ్మెల్యే లక్ష్మణ్  కుమార్ అన్నారు.


👉 చలివేంద్రాలు ప్రారంభం !


పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో ధారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ  ఆధ్వర్యంలో   ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని , స్థానిక మున్సిపల్ కార్యాలయం సమీపంలో 

తోట సుశీలమ్మ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు శంకర్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.