అంగరంగ వైభవంగా నరసింహ నవరాత్రి ఉత్సవాలు !

J.SURENDER KUMAR,


ధర్మపురిలో “శ్రీ నృసింహనవరాత్రోత్సవములు” శనివారం అంగరంగ వైభవముగా ఆరంభమయ్యాయి.   శనివారం తెల్లవారుజామున అనుబంధ ఆలయాల అర్చకులు మంగళ వాయిద్యములో తో గోదావరి నదికి వెళ్ళి  నదులు ప్రత్యేక పూజలు  నిర్వహించి పవిత్ర గోదావరి జిల్లాలు తెచ్చారు. 

6.30 గంటలకు స్వస్తి పుణహవచనము, ఋత్విక్వరణము, కలశ స్థాపన, శ్రీస్వామి వారికి పంచోపనిషత్తులతో అభిషేకము, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

సాయంత్రం   వేదోక్తముగా సహాస్ర కలశస్థాపన, నవగ్రహ, యోగినివాస్తు, క్షేత్రపాలక స్థాపనలు, అర్చనాది ఆరాధన, నిత్య హోమము, నిత్య కళ్యాణము తదితర కార్యక్రమములు నిర్వహించారు. నరసింహుడు దర్శనానికి భారీ సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. గంటల తరబడి జూలై నుండి స్వామివారిని దర్శించుకున్నారు.


కార్యనిర్వహణాధికారి  సంకటాల శ్రీనివాస్, అధ్యక్షులు  జె. రవీందర్, ధర్మకర్తలు ఎ. మహేందర్, బి.వెంకటేష్, బి. పోచయ్య,  జి.రవీందర్, కె.పవన్ కుమార్, ఎమ్.మల్లేష్,  ఎన్. శ్రీధర్,  ఆర్.సాయికిరణ్, ఎస్.గణేష్,  ఎస్.తిరుపతి, శ్రీమతి వి. సౌజన్యనరేందర్, మార్కెట్ కమిటి అధ్యక్షులు శ్రీమతి చిలుముల లావణ్యలక్ష్మణ్, మాజీ దేవస్థాన అధ్యక్షులు  ఎస్.దినేష్ , ఆలయ వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ, ప్రవీణ్ కుమార్ శర్మ, ఉపప్రధాన అర్చకులు నేరేళ్ళ శ్రీనివాసాచార్యులు, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచార్యులు, సిహెచ్ రమణయ్య, అర్చకులు నంబి నర్సింహమూర్తి, నేరేళ్ళ సంతోష్ కుమార్, వొద్దిపర్తి కళ్యాణ్, సముద్రాల వంశీ, చక్రపాణి కిరణ్, అభిషేక పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్, బొజ్జ సంపత్ కుమార్, బొజ్జ రాజగోపాల్ శర్మ, సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.