ఏప్రిల్ లో 21 మంది పై ఏసిబి కేసులు నమోదు !

👉 రెండు రోజులకు ఒకరిని  ట్రాప్ చేసి 13 మంది అరెస్టు రిమాండ్ !


J.SURENDER KUMAR

రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏప్రిల్ మాసంలో చాకచక్యంగా మెరుపు దాడులు చేసి 21 మంది ఉద్యోగులపై కేసులో నమోదు చేశారు. 
ఈ కేసులలో 13 మంది అవినీతి ఉద్యోగులను ట్రాప్ చేసిరెడ్ హ్యాండ్ గా పట్టుకొని 24 గంటల్లో జ్యుడీషియల్ కస్టడీ రిమాండ్ కు తరలించారు.


ఏసిబి ట్రాప్ లో పట్టుబడిన నగదు మొత్తం ₹ 5 లక్షల రెండు వేల రూపాయలు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు  రెండు కేసులలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి విచారణ చేస్తున్నారు. ఓ అధికారి ఆస్తుల ₹ 3 కోట్ల, 51 లక్షల, 6 వేల 759/- రూపాయల విలువ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మరో ఉద్యోగి కి సంబంధించి వచ్చిన ఫిర్యాదు పై మెరుపు దాడులు నిర్వహించి ఆస్తుల వివరాలు లెక్కించగా ప్రస్తుతం ₹ 13 కోట్ల 50 లక్షల ఆస్తులు ఉన్నట్టు ఈనెల 30 నాటికి అధికారులు గుర్తించారు.


మరో రెండు క్రిమినల్, దురుసు ప్రవర్తన, విధుల నిర్వహణలో అవినీతి, ఉద్యోగి ప్రవర్తన వేధింపుల పై కార్యకలాపాలపై  కేసు నమోదు చేశారు.

👉 అవినీతి పై ఫిర్యాదులు చేయండి –
ఏసీబీ డైరెక్టర్ జనరల్ !


  👉 కాల్ ఫోన్ నంబర్-1064 (టోల్ ఫ్రీ నంబర్)
ఏదైనా పబ్లిక్ సర్వెంట్ లంచం డిమాండ్ చేసినట్లయితే, చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ACB యొక్క టోల్ ఫ్రీ నంబర్, అంటే 1064ను సంప్రదించాలని ప్రజలను అభ్యర్థించారు.


👉 ACB, తెలంగాణను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు అంటే Whatsapp (9440446106),


👉 Facebook (తెలంగాణ ACB)
, X/గతంలో ట్విట్టర్ (@TelanganaACB) ద్వారా కూడా సంప్రదించవచ్చు.


బాధితురాలి/ఫిర్యాదుదారు పేరు మరియు వివరాలు రహస్యంగా ఉంచబడతాయి.