భక్తులకు ఇబ్బందులు కలగవద్దు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

వేసవిలో సెలవుల నేపథ్యంలో ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి నిత్యం భారీ సంఖ్యలో తరలివచ్చే  భక్తులకు ఆలయంలో, ఆలయ ప్రాంగణంలో ఇబ్బందులు కలగవద్దని, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ ను ఆదేశించారు.

శనివారం అంగరంగ వైభవంగా ఆరంభమైన శ్రీలక్ష్మీ నరసింహ స్వామి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారి దర్శించుకున్నారు. అనంతర అర్చకులు, వేద పండితులు ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. పాలకవర్గ చైర్మన్ జక్కు రవీందర్ , ధర్మకర్తలు, కార్యనిర్వహణాధికారి, స్వామివారి శేష వస్త్రంతో ఎమ్మెల్యే ను సన్మానించారు.

👉 చలువ టెంట్లు వేయండి !

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వచ్చే భక్తజనం కు నిలువ నీడ కోసం రాజగోపురం ముందు కూలింగ్ టెంట్లు వేయాలని, క్యూలైన్ లో అదనంగా మూడు ఫ్యాన్ లు ఏర్పాటు చేయాలని అక్కడే ఓ చలివేంద్రం ఏర్పాటు చేయాలని భక్తుల కాళ్లు కాలకుండా గ్రీన్ మ్యాటే వేయాలని కార్యనిర్వహణాధికారిని ఎమ్మెల్యే ఆదేశించారు.
ప్రస్తుతం ఏర్పాట్లు బాగా చేశారని, ఏర్పాట్లు మరింత మెరుగుపరచాలని, ఈ ఓ ను పాలకవర్గాన్ని ఎమ్మెల్యే అభినందించారు.

👉 ఎమ్మెల్యే కు భద్రత పెంచారా ?

ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు భద్రత పెంచినట్టు అనిపించింది. శనివారం స్వామివారి దర్శనానికి వచ్చిన ఎమ్మెల్యేకు రక్షణగా యువకులైన సాయుధ పోలీసులు అధునాతనమైన ఆయుధాలు చేత పట్టుకొని అగుపించారు. సహజంగా ఇద్దరు అంగరక్షకులు, ఎస్కార్ట్ వాహనం, ఏఎస్ఐ , ముగ్గురు డిస్టిక్ గార్డులు రక్షణగా ఉంటారు. వీరితో పాటు స్థానిక ఎస్సై మరో ఇద్దరు సాయుధులు ఉంటారు.

ఎమ్మెల్యే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం భద్రత మరింత కట్టుదిట్టం చేసిందని పోలీస్ అధికారి స్పష్టం చేశారు.