J.SURENDER KUMAR,
వివిధ ప్రాంతాల నుండి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకోవడానికి వచ్చే భక్తజనం ను గౌరవించండి, ఆలయ ఆదాయాన్ని పెంచండి, మీ సంక్షేమ బాధ్యత నాది అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆలయ ఉద్యోగులతో అన్నారు.
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల జీతాలు ప్రభుత్వం పెంచిన సందర్భంలో ఆదివారం ఉద్యోగులు ధర్మపురిలో క్యాంప్ కార్యాలయం కు వచ్చి ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తో గత కొన్ని సంవత్సరాలుగా మా గూర్చి ఎవరు పట్టించుకోలేదని, మీరు ప్రత్యేక చొరవతో మా జీతాలు పెంపుదలకు కృషి చేసిన మీ రుణం తీర్చుకోలేము అంటూ ఎమ్మెల్యే ను అభినందించారు.
ఇది ఇలా ఉండగా, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గత సంవత్సరం మార్చి, సెప్టెంబర్ మాసంలో తాత్కాలిక ఉద్యోగుల జీతాలు పెంచాల్సిందిగా కోరుతూ దేవదాయ శాఖ కమిషనర్ కు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో ఈనెల 3 న లేఖ సంఖ్య 1816/2023, ద్వారా అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి 15 మంది ఉద్యోగులకు ₹ ,6 వేల నుండి ₹ 12 వేలు, మరో 4 గురు కాంటాక్ట్ ఉద్యోగులకు ₹ 7 వేల నుండి ₹ 15 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

👉 అర్చకులకు, స్వీపర్లకు త్వరలో ..
తాత్కాలిక అర్చకులకు, స్వీపర్లకు త్వరలో వారి వేతనాలు పెంచడానికి కమిషనర్ తో చర్చిస్తానని ఆర్థిక పరమైన సాంకేతిక నిబంధన మేరకు వారి పెంపుదల వేతన ఉత్తర్వులు జారీ కాలేదని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఉద్యోగులతో అన్నారు.

ఆలయ ఆదాయాన్ని మీరు పెంచగలిగితే డిప్యూటీ కమిషనర్ హోదా పర్యవేక్షణ పరిధిలోకి ఈ ఆలయం చేరుతుందని ఎమ్మెల్యే అన్నారు. కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, సూపరింటెండ్,సీనియర్ అసిస్టెంట్, ఉద్యోగులు, ఆలయ పాలకవర్గ చైర్మన్ జక్కు రవీందర్, ధర్మకర్తలు, తదితరులు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.