👉 ఉద్రిక్తతలు తక్షణమే తగ్గించండి.!
👉 జైశంకర్, షహబాజ్‌కు ఫోన్ !
J.SURENDER KUMAR,
భారత్ పాకిస్తాన్ దేశాలు తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాలని అమెరికా విజ్ఞప్తి చేసింది. రెండు దేశాలు ప్రత్యక్షంగా చర్చలు జరపాల్సిన అవసరం ఉందని అగ్రరాజ్యం అభిప్రాయం వ్యక్తం చేసింది.
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా రంగంలోకి దిగింది. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తో అమెరికా సెక్రటరీ మార్కో రూబియో ఫోన్‌లో మాట్లాడారు. అదే సమయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు కూడా మార్కో రుబియో ఫోన్ చేశారు.
తక్షణమే రెండు దేశాలు ఉద్రిక్తతలను ఆపేయాలని హితవు పలికారు. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలకు అమెరికా మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
అదే సమయంలో ఉగ్రవాదాన్ని సమూలంగా అంతం చేసేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు అమెరికా అన్ని రకాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ ఫోన్ కాల్స్‌కు సంబంధించిన వివరాలను యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి టామీ బ్రూస్ గురువారం రాత్రి తెలిపారు. మరోవైపు.. పహల్గామ్ ఉగ్రదాడికి మార్కో రూబియో సంతాపం తెలిపారు.