భూమేష్ మృతి బాధాకరం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

వోడ్నాల భూమేష్  రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం బాధాకరమని  ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అన్నారు.

ధర్మపురి పట్టణానికి చెందిన  యువకుడు వోడ్నాల భూమేష్  బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.


భూమేష్ మృతదేహానికి ఎమ్మెల్యే నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతిమ దహన సంస్కారాల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.