బిఆర్ఎస్ అరాచకాలకు ప్రజలు ఓడించి కాంగ్రెస్ ను గెలిపించారు !

👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


బిఆర్ఎస్ పార్టీ  పది సంవత్సరాల పాలనలో చేసిన అరాచకాలకు ప్రజలు విసిగి వేసారి కసితో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అధికారం అప్పగించారు అని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మారం మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం  మీడియా సమావేశంలో  ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై తీవ్రస్థాయిలో  ధ్వజమెత్తరు.

👉 ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశంలో పాయింట్స్..

👉 వెలగటూర్ మండలం  పాశీగామాలో ఇథనాల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా  ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తే మాపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించింది మీరు కాదా ?  అని నిలదీశారు.

👉 ఈ రోజు మమ్మల్ని  మీరు పోలీసులను పెట్టుకొని మాపై దాడులు చేస్తున్నారు అని ఆరోపించడం  ఎంత వరకు సమంజసమనీ ప్రశ్నించారు.

👉 అదనపు టీఎంసీ పేరుతో వెల్గటూర్ రైతాంగం వద్ద లక్షలాది రూపాయలు విలువ గల  భూములను పోలీసులను పెట్టీ అతి తక్కువ ధరకు నిర్బంధంగా లాక్కున్నది మీరు కాదా ? అని ప్రశ్నించారు .

👉 పెద్దపల్లి ఎంపీ గా పోటీ చేసి గెలిచిన వెంకటస్వామి  మూడో తరం  గడ్డం వంశీకృష్ణ పై ఓడిన నాడే మీ పార్టీ మీద, ప్రజలకు విశ్వాసం లేదని తెలిసిందన్నారు.

👉 మేడారం నుండి అప్పటి మంత్రి హరీష్ రావు సాగు తాగు నీరును  తీసుకుపోతే మంత్రి హోదాలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

👉 ఈ ప్రాంతం కు చెందాల్సిన వందలాది కోట్ల డిఎంఎఫ్టి నిధులు నాటి మంత్రులు హరీష్ రావు, కేటీఆర్  తమ ప్రాంతాలకు తీసుకుపోతే నాడు ఎందుకు మౌనవహించావు అని మాజీ మంత్రి నీ ప్రశ్నించారు.

👉 2018 ఎన్నికల్లో  నన్ను ధర్మపురి నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే  ఆ గెలుపును  ఓర్వలేక కుట్ర పూరితంగా నన్ను అప్పటి కలెక్టర్ సహాయంతో ఓటమి చెందినట్లు ప్రకటన చేయించలేదా ?  అని ప్రశ్నించారు.

👉  రాష్ట్రాన్ని ఆర్థికంగా అప్పుల కుప్పగా మార్చి మాకు అప్పజెప్పితే మా ప్రభుత్వం మీరు చేసిన అప్పులకు వడ్డీలను కడుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.

👉 మేము అధికారంలోకి వచ్చి కేవలం సంవత్సరంన్నర మాత్రమే అయిందనీ, మాజీ మంత్రి  ఈశ్వర్ ఎందుకు అంత ఆవేశ పడుతున్నారో ?  అర్థం కావడం లేదన్నారు.

👉 ఎమ్మెల్యే, విప్, మంత్రిగా కొప్పుల ఈశ్వర్ పదవిలో ఉండి చెయ్యలేని పనులు మేము చేస్తున్నామని ఈర్ష్యతో ఇలాంటి దిగజారుగుడు పనులు చేస్తున్నారని, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.

👉 2004 సంవత్సరానికి ముందు కొప్పుల ఈశ్వర్ ఆస్తులు ఎన్ని ?  ఇప్పుడు ఉన్న ఆస్తులు  ఎన్ని ? ఆ వివరాలు బయటి తీస్తానన్నారు.

👉 ఇప్పటి వరకు సహనంతో వ్యవహరించం కానీ ఇష్టానుసారంగా మాట్లాడితే  ఇక సహనం వహించేది లేదని లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు.
.