బీఆర్ఎస్ నేత అక్కెనపల్లి సునీల్ హఠాన్మరణం !

J. SURENDER KUMAR,

ధర్మపురి పట్టణానికి చెందిన బిఆర్ఎస్ నేత వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్  అక్కెనపల్లి సునీల్  (47)  మంగళవారం అర్ధరాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.

రైస్ మిల్ వ్యాపారం నిర్వహించే సునీల్ తన పార్టీ శ్రేణులతో పాటు, ప్రతిపక్ష పార్టీ శ్రేణులతో కూడా కలిసిమెలిసి ఉండేవాడు. నియోజకవర్గ పార్టీ అంతర్గత  కార్యక్రమాలలో సునీల్ ది ప్రత్యేక పాత్ర . సునీల్ మృతి పట్ల వర్తక వ్యాపార వర్గాలు వివిధ రాజకీయ పార్టీ సంతాపం వ్యక్తం చేశారు.

మంగళవారం ఉదయం గోదావరి తీరంలో సునీల్ అంతిమ దహన సంస్కారాలు జరిగాయి.

సునీల్ మృతదేహంపై బిఆర్ఎస్ పార్టీ జెండా కప్పి పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి స్నేహలత  సునీల్ అంతిమ సంస్కారాలలో పాల్గొని నివాళులర్పించారు.