భూ సమస్యలు పరిష్కారం కే భూభారతి చట్టం !


👉 రైతులు సద్వినియోగం చేసుకోవాలి.!


👉 ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్.!


J.SURENDER KUMAR,


రైతులు ఇబ్బందులు పడకుండా వారి భూ సమస్యలు పరిష్కరించేందుకే ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పకడ్బందీగా భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నారని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో భూభారతి పైలెట్ ప్రాజెక్టు కింద శనివారం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సును మంత్రి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.


ఈ కార్యక్రమానికి మంత్రి తోపాటు ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్  ఎస్పీ అశోక్ కుమార్ హాజరయ్యారు.


👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…


గత బిఆర్ఎస్ పాలకులు తెచ్చిన ధరణి వల్ల రైతుల అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ధరణి వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు.


👉 భూభారతి చట్టం రైతులకు చుట్టమని చెప్పారు. రైతులు చట్టాన్ని ఉపయోగించుకొని భూ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.


👉 గత పాలకుల నిర్వాకం వల్ల రైతులు ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని మండిపడ్డారు. ధర్మపురి లో రెవెన్యూ డివిజన్ కార్యాలయం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు.


👉ఇందుకోసం మంత్రి సానుకూలంగా స్పందించారు. వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


👉 గత బిఆర్ఎస్ పాలకులు ధర్మపురి నియోజకవర్గంలో సాగునీటిని అందించకుండా కేసీఆర్ హరీష్ రావు తమ సొంత ప్రాంతాలకు తీసుకెళ్లారని ఆరోపించారు.


👉 నాడు అధికారంలో ఉండగా బిఆర్ఎస్ పాలకులు ధర్మపురి అభివృద్ధి చేస్తామని వాగ్దానం చేసి పట్టించుకోలేదని పేర్కొన్నారు. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజల అండదండలతోనే ఎమ్మెల్యేగా విజయం సాధించానని తెలిపారు. నియోజకవర్గాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం పాటుపడుతున్నారని పేర్కొన్నారు.


👉 పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం గొప్పగా పనిచేస్తున్నది..

👉 జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్..


గతంలో ఎన్నడూ చూడని విధంగా కనివిని ఎరుగని రీతిలో పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా పని చేస్తున్నదని, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు అహర్నిశలు కష్టపడుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.


👉1975 సంవత్సరంలో నాడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ఇందిరమ్మ ఇండ్లు నేటికీ గ్రామాల్లో చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు.


👉 మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తూ సొంత ఇంటి కలను నెరవేరుస్తున్నదని తెలిపారు.


👉 కాంగ్రెస్ తోనే పేదల సంక్షేమం సాధ్యమవుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం సాధ్యమవుతుందన్నారు.


👉 భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం అద్భుతంగా ఉందన్నారు. భూభారతి చట్టం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమయంలో తనకు మాట్లాడే అవకాశం దక్కడం జీవితంలో మర్చిపోలేనని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నదని, నాయకులు ప్రజలకు వివరించాలని సూచించారు.

👉 భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి.!

👉 గ్రామాల వారీగా పక్కాగా భూ రికార్డులు.!

👉  జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ !


👉 రైతులు ప్రజలకు సంబంధించిన భూ సమస్యలు పరిష్కరించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు.
బుగ్గారం గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకున్నామని, భూ సమస్యలకు సంబంధించి 844 దరఖాస్తులు వచ్చాయన్నారు.
ఇందులో అత్యధికంగా సాదాబైనామాకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయనీ, భూ సమస్యలను అన్నింటిని సత్వరమే పరిష్కరిస్తామన్నారు.


👉 గ్రామాల వారిగా రెవెన్యూ రికార్డులు భూ రికార్డులు భద్రంగా ఉండేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు.


రైతులకు భూభారతి చట్టం ఎంతో మేలు చేస్తుందని సమస్యల పరిష్కారానికి చక్కగా వినియోగించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పలువురు రైతులకు భూమి హక్కు పత్రాలను అందించారు.

అంతకు ముందు మంత్రి శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి శేష వస్త్రం, గజమాలతో ఘనంగా సన్మానించారు