సీఎం రేవంత్ రెడ్డి కాలేశ్వరం పర్యటనకు భారీ భద్రత  ఏర్పాట్లు !

👉 సీఎం భద్రతాధికారి వాసుదేవ రెడ్డి !


J.SURENDER KUMAR,


రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి గురువారం కాళేశ్వరం పర్యటనకు రానున్న సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్  రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ శ కిరణ్ ఖరే, ముఖ్యమంత్రి భద్రతా అధికారి  వాసుదేవరెడ్డి తెలిపారు.


బుధవారం కాళేశ్వరంలో ఈఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి పర్యటనపై అధికారులతో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.


ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రజలెవ్వరూ అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

👉 హెలికాప్టర్ ద్వారా గురువారం సాయంత్రం 5 గంటలకు కాళేశ్వరం చేరుకుంటారని ముఖ్యమంత్రి రవాణా చేయు మార్గంలో పోలీస్ బందోబస్తు, బాంబ్ స్క్వాడ్, ట్రాఫిక్ కంట్రోల్, ఆయా విభాగాల సమన్వయంతో భద్రతా చర్యలుపర్యవేక్షణ చేయాలని  తెలిపారు. మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

👉 ఎస్డీఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ బృందాల సేవలు విజియోగించ నున్నట్లు తెలిపారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, ప్రత్యాన్మయంగా జనరేటర్ సిద్ధంగా ఉంచాలని విద్యుత్ అధికారులకు సూచించారు.  బందోబస్తు ప్రతి ఒక్కరి బాధ్యతని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డిఓ రవి, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.