సీఎం రేవంత్ రెడ్డి కి  కృతజ్ఞతలు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

👉 భూ భారతి చట్టం అమలు కోసం బుగ్గారం మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక !


J.SURENDER KUMAR,


రైతుల సౌలభ్యం కోసం భూ భారతి చట్టం అమలు కోసం తన నియోజకవర్గంలోని బుగ్గారం మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ సత్యప్రసాద్ కు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్  కృతజ్ఞతలు తెలిపారు.


జగిత్యాల జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ గెస్ట్ హౌజ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..


👉 గత ప్రభుత్వంలో ప్రవేశ పెట్టిన ధరణి కారణంగా ఎంతో మంది రైతులు  ఇబ్బందులు పడ్డారని వారి ఇబ్బందులు, సమస్యలను పరిష్కరించాలని ఉద్దేశంలో భూ భారతి చట్టం అమలు  చేస్తున్నామని అన్నారు.


👉 కొత్త చట్టాన్ని అమలు చేస్తున్నప్పుడు కొన్ని  ఇబ్బందులు, పొరపాట్లు జరగడం సహజమని వాటన్నింటిని సరిదిద్దుకుంటూ  రైతులకు ఎక్కడ ఎలాంటి  ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం పక్షాన అన్ని  రకాల ముందస్తు చర్యలు తీసుకోనున్నట్లు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.


👉 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి చట్టాన్ని రద్దు చేస్తామని  ఇచ్చిన హామీ మేరకు ఆ చట్టాన్ని రద్దు చేసి భూ భారతి చట్టాన్ని  అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి  అమలు చేశారన్నారు.


👉 ఇటీవల మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్  మీడియా సమావేశంలో  ధర్మపురి నియోజకవర్గంలోని స్తంభంపల్లి కి మంజూరు అయిన  వ్యవసాయ కళాశాల  వేరే నియోజకవర్గానికి తరలిస్తున్నారు అని చేసిన అసత్య ప్రచారం ఖండిస్తున్నాను అని ఎమ్మెల్యే అన్నారు.


👉 జివో ప్రకారం స్టాంబంపెల్లి కి మంజూరు అయిన వ్యవసాయ కళాశాల,  మరో నియోజకవర్గానికి తరలిస్తే నేను దేనికైనా సిద్ధం అన్నారు.


👉 సిద్దిపేటకు మంజూరు అయిన కళాశాలను  ఇక్కడ మంజూరు అయినట్టు  ప్రజలను తప్పు దోవ పట్టించడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు.
మాజీ మంత్రి,  సమయము, స్థలము చెప్పితే అక్కడికి వచ్చి ఈ విషయాన్ని నిరూపిస్తామని, ప్రజలను మభ్య పెట్టే చర్యలు మానుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే  లక్ష్మణ్ కుమార్ అన్నారు.