సీఎం రేవంత్ రెడ్డికి సరస్వతి పుష్కరాల ఆహ్వానం !

J.SURENDER KUMAR,

ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న సరస్వతీ పుష్కరాలలో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి కి దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ  ఆహ్వానం అందించారు.


మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు  ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి కి ఆహ్వానం అందజేశారు.


మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ లకు మంత్రి  ఆహ్వానం అందించారు.
15 నుంచి 26 వ తేదీ వరకు 12 రోజుల పాటు జరిగే భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చేస్తున్న ఏర్పాట్ల గురించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.