👉 మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి !
J.SURENDER KUMAR,
.కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు భూ సమస్యలను పరిష్కరించాలనీ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చిన భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
శుక్రవారం రాత్రి జగిత్యాల కలెక్టరేట్లో పైలెట్ మండలాల్లో భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సుల నిర్వహణ తీరు తెన్నులు.. భూ సమస్యల పరిష్కారం.. ఆయా జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై మంత్రి శ్రీనివాస్ రెడ్డి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ లు అడ్లూరి లక్ష్మణకుమార్, ఆది శ్రీనివాస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి ఆయా జిల్లాల్లో పైలెట్ మండలాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లు మానవీయ కోణంలో భూ సమస్యలు పరిష్కరించాలని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో భూ సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఉమ్మడిజిల్లా కలెక్టర్లు సమన్వయంతో కలిసి పనిచేస్తూ భూ సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. ప్రజలు రైతులు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజల శ్రేయస్ కోసం నిరంతరం పాటుపడాలని సూచించారు. పెండింగ్ లోఉన్న భూ సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో మంత్రి కలెక్టర్లకు సూచనలు సలహాలు అందజేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే రెవెన్యూ అధికారులపై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లకు సూచించారు.

అధికారులు బాధ్యతాయుతంగా విధంగా పనిచేసేలా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు. ప్రజలు రైతుల సంక్షేమం కోసమే అధికారులు పనిచేయాలని సూచించారు. అలాగే కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు త్వరగా చేపట్టాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ, పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లతా, పలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
👉 శనివారం జగిత్యాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పర్యటన వివరాలు !
👉 జగిత్యాల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి ఉదయం 8:00 గంటలకు బయలుదేరుతారు.
👉 9:00 బుగ్గారం మండల కేంద్రానికి చేరుకుంటారు.
👉 9:00 నుండి 10:30 వరకు బుగ్గారంలో నిర్వహించనున్న భూభారతి కొత్త రెవెన్యూ చట్టం అవగాహన సదస్సులో పాల్గొంటారు.
👉ఉదయం 10.30 కి కార్యక్రమం ముగించుకుని మెదక్ జిల్లాకు బయలుదేరుతారు.