J.SURENDER KUMAR,
మంథని నియోజకవర్గం కాటారం మండలం మంత్రి శ్రీధర్ బాబు, స్వగ్రామం ధన్వాడ లో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయ 3 వ వార్షికోత్సవం లో మంత్రి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

గ్రామ ప్రజలతో కలిసి ఆదివారం మంత్రి శ్రీధర్ బాబు ఆలయం లో గణపతి పూజ, 54 ప్రత్యేక కలశలు ఏర్పాటు చేసి దత్తాత్రేయ స్వామికి మంత్రోత్సవం జరిపిన ఆ జలంతో స్వామివారికి అభిషేకము, దత్త హోమం నిర్వహించారు

శ్రీ దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, అలాగే ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని, అలాగే సకాలంలో వర్షాలు కురిసి రైతులకు అధిక దిగుబడులు రావాలని మంత్రి కోరారు.

ఈ కార్యక్రమంలో ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, వివిధ గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.