👉 ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ , ప్రత్యేక చొరవతో..
J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గత కొన్ని సంవత్సరాలుగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ గా విధులు నిర్వహిస్తున్న 29 ఉద్యోగులు జీతాలు పెరగనున్నట్టు సమాచారం.
స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ తో వీరు తమకు జీతాలు పెరగడం లేదు, ఇబ్బందులు పడుతున్నామని జీతాలు పెంచి ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. ఈ మేరకు స్పందించి ఎమ్మెల్యే దేవాదాయ శాఖ కమిషనర్ కు అధికారిక లేఖ రాసినట్టు సమాచారం.

నిబంధనల మేరకు ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల తో పాటు 9 మంది తాత్కాలిక అర్చకుల జీతాలు పెంచాలని కమిషనర్ ను కోరారు. ₹ 7 వేలు, ₹ 8 వేలు పొందుతున్న అర్చకులకు దాదాపు ₹ 18 వేలు ₹ 6 వేల వేతనం పొందుతున్న 15 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ₹ 12 వేలు, ₹ 7 వేల వేతనం పొందుతున్న 4 కాంట్రాక్టు ఉద్యోగులకు ₹ 15 వేలు, కంప్యూటర్ ఆపరేటర్ కు ₹ 22 వేలు పెరిగినట్టు సమాచారం.
ఈ మేరకు శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ దేవాదాయ కమిషనర్ కు ఫోన్ చేసి ఉత్తర్వులను జారీ చేయాల్సిందిగా కోరారు.
నేడు లేదా రేపు దేవదాయ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు సమాచారం.
