J.SURENDER KUMAR,
వేద పండితులకు నిలయమైన ప్రముఖ ధర్మపురి పుణ్యక్షేత్ర బ్రాహ్మణ సంఘానికి మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు.
నరసింహ జయంతి సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రి స్థానిక బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు ఇందారపు రామయ్య, నాయకులు, సంఘనపట్ల దినేష్, మణితేజ లకు లక్ష రూపాయల నగదు అందించారు.
గత సంవత్సరం ధర్మపురికి వచ్చిన సందర్భంలోనూ మంత్రి బ్రాహ్మణ సంఘానికి లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు.