ధర్మపురి లో మంత్రి దామోదర్ రాజనర్సింహ !


J.SURENDER KUMAR,


వైద్య  ఆరోగ్య  శాఖ మంత్రి దామోదర్  రాజా నరసింహ  శనివారం రాత్రి ధర్మపురి క్షేత్రానికి చేరుకున్నారు.
మంత్రిని స్థానిక ఎమ్మెల్యే  ప్రభత్వ విప్ అడ్లూరి  లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కలెక్టర్  బి సత్య ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలసి స్వాగతించారు.


శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున ఆలయంలో జరగనున్న స్వామివారి అభిషేకం, ప్రత్యేక పూజది కార్యక్రమాలలో మంత్రి  దామోదర్ రాజనర్సింహ పాల్గొననున్నారు. స్వామివారి దర్శనానంతరం  మంత్రి జగిత్యాల జగిత్యాలకు వెళ్ళనున్నారు.