ధర్మపురిలో అంగరంగ వైభవంగా నృసింహ జయంతి!

J.SURENDER KUMAR,


ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆదివారం అంగరంగ వైభవంగా శ్రీ నరసింహ జయంతి ఉత్సవాలు జరిగాయి.


శ్రీ నృసింహనవరాత్రోత్సవములలో” భాగంగా చివరి రోజైన నేడు నృసింహ జయంతి సందర్భముగా శ్రీస్వామి వారికి పురుషసూక్త, శ్రీసూక్త, కల్పోక్త, న్యాసకపూర్వక షోడశ ఉపచార పూజ, సహాస్రనామార్చన, పంచోపనిషత్తులతో మరియు మన్యసూక్తముతో మరియు సున్నాల వన్నము మరియు రుద్రముతో అభిషేక పూజలు, విశేష పూజలు మరియు పంచోపనిషత్తులతో అభిషేకము, సహస్రనామార్చన, హారతి వేదమంత్ర పుష్పము మరియు చతుర్వేద అవధార్యములు మరియు భజన కార్యక్రమములు జరిగాయి.


నృసింహ జయంతి సందర్భముగా ఆలయ రాజగోపురములకు, శ్రీస్వామి వార్లకు అనుబంధం ఆలయాలకు  ప్రత్యేక పూల తో అలంకరించారు. స్వామివారి జయంతి ఉత్సవాలు, ప్రత్యేక పూజలు మంత్రి దామోదర రాజ నర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. తరలివచ్చిన భక్తజనంతో ఆలయ ప్రాంగణం పోటెత్తింది.


👉 స్థంభోద్భవ పూజాది కార్యక్రమాలు !


యోగా నరసింహ స్వామి మండపంలోని నాలుగు రాత్రి స్తంభాలకు అర్చకులు వేద పండితులు పువ్వులు నూతన వస్త్రాలు అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పవిత్ర స్థంభోద్భవ  కార్యక్రమం దర్శించుకోవడానికి భక్తజనం తరలి వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు.


ఆలయ వేద పండితులు, అర్చకులు బొజ్జ రమేష్ శర్మ, ప్రవీణ్ కుమార్ శర్మ, ఉపప్రధాన అర్చకులు నేరేళ్ళ శ్రీనివాసాచార్యులు, ముఖా అర్చకులు నంబి శ్రీనివాసాచార్యులు, సిహెచ్ రమణయ్య, అర్చకులు నంబి నరసింహమూర్తి, నేరేళ్ళ సంతోష్ కుమార్, వొద్దిపర్తి కళ్యాణ్, సముద్రాల వంశీ, చక్రపాణి కిరణ్,

అభిషేక పురోహితు బొజ్జ సంతోష్ కుమార్, బొజ్జ సంపత్ కుమార్, బొజ్జ రాజగోపాల్ శర్మ, కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, పాలకవర్గ అధ్యక్షుడు జక్కు రవీందర్, ధర్మకర్తలు, సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ తదితరు పాల్గొన్నారు.