J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం నంది చౌక్ లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ నందమూరి తారకరామారావు 102వ జన్మదిన వేడుకలు బుధవారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు జరిపారు.
మండల పార్టీ అధ్యక్షులు వుప్పుల రామకిష్టయ్య ఆధ్వర్యంలో NTR చిత్రపటానికి పూలమాలవేసి టెంకాయ కొట్టి తెలుగుదేశం పార్టీ జండా ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మండలపార్టీ ఉపాధ్యక్షులు వెన్నం గంగారెడ్డి. కార్యనిర్వహణ కార్యదర్శి అయ్యోరు శంకరయ్య , పట్టణ అధ్యక్షులు తీర్మానదాస్ శ్రీనివాస్, పట్టణ ప్రధానకార్యదర్శి గుండారపు రాజశేఖర్ , పట్టణ కార్యనిర్వహణ కార్యదర్శి వొజ్జల పుల్లయ్య శాస్త్రి తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యులు పాల్గొన్నారు