ధర్మపురి నరసింహుడికి పెరిగిన ఆదాయం !

👉 రెండు రోజులలో 9 లక్షలు !

👉 సరస్వతి పుష్కరాల ఎఫెక్ట్ !


J.SURENDER KUMAR,


ధర్మపురి శ్రీ లక్ష్మీన సింహ స్వామి ఆలయానికి సరస్వతి పుష్కరాల ప్రభావంతో భక్తుల రద్దీ తో పాటు  రెండు రోజులలో ₹ 9 లక్షల 27 వేల 866/- రూపాయల ఆదాయం వచ్చింది.

కాలేశ్వరం క్షేత్రంలో గురువారం అంగరంగ వైభవంగా సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుండి పుష్కరాలకు కాలేశ్వరం కు వచ్చిన భక్తజనం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడానికి తరలిరావడంతో క్షేత్రంలో భక్తజనం పోటెత్తింది.

ఈ మేరకు  17 న ఆలయానికి వచ్చిన ఆదాయం

👉 టికెట్లు      ₹  1,84,200/-

👉 ప్రసాదాలు ₹ 1,39,600/-

👉 అన్నదానం ₹ 1,89,047/-

👉 మొత్తం ₹ 5,12,847 ఆదాయం వచ్చింది.


ఆదివారం  అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తరలి రావడంతో ఆలయ కార్య నిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్, సిబ్బంది, పాలకవర్గ సభ్యులు, భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్ లో క్రమబద్ధీకరించారు. 

అనుబంధ ఆలయాలలోనూ రద్దీ విపరీతంగా పెరిగింది

👉టికెట్లు      ₹ 2,28,666/-

👉 ప్రసాదాలు ₹ 1,03,600/-

👉 అన్నదానం ₹  82,753/-

👉 మొత్తం ₹ 4,15,019/- ఆదాయం వచ్చింది.

పుష్కరాల నేపథ్యంలో కాలేశ్వరం పుష్కర స్నానం చేసిన భక్తులు ఈనెల 26 వరకు భారీ  సంఖ్యలో ధర్మపురి ఆలయాన్ని దర్శించుకున్నట్లు అధికార యంత్రాంగం అంచనా వేస్తూ ఆ మేరకు ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు.