J.SURENDER KUMAR
ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క @ ధనసరి అనసూయ, సోమవారం పర్యటించనున్నారు.
మండలంలోని కిచులాటపల్లి నుండి మల్లాపూర్ ఎక్స్ రోడ్డు వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులతో పాటు మండలంలో కోట్లాది రూపాయల నిధులతో చేపట్టనున్న అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయడానికి మంత్రి రానున్నారు.
కిచూలాటపల్లి గ్రామంలో పనుల శంఖుస్థాపన చేయనున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ శనివారం సాయంత్రం అధికారులు, మండల నాయకులతో కలసి సభ స్థలము, వేదికను పరిశీలించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాము గౌడ్, మాజీ జడ్పీటీసీ కాసుగంటి రాజేండర్ రావు, తదితర నాయకులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.