👉 సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు చేస్తా!
J. SURENDER KUMAR,
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాట్లను ప్రకటిస్తే ధర్మపురి రెవెన్యూ డివిజన్ గా మొదటి పేరు ధర్మపురి ఉంటుందని. రెవెన్యూ గృహ నిర్మాణ పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో భూభారతి పైలెట్ ప్రాజెక్టు కింద శనివారం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సును మంత్రి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తోపాటు ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఎస్పీ అశోక్ కుమార్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , మంత్రి శ్రీనివాసరెడ్డిని ప్రముఖ పుణ్యక్షేత్రంగా నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు.
ఇదే జిల్లాలో కోరుట్ల, మెట్టుపల్లి రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయని. ధర్మపురి 7 మండలాల రైతాంగానికి అందుబాటులో ఉంటుందని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
దీంతోపాటు ధర్మపురి పట్టణంలో సబ్ రిజిస్టార్ కార్యాలయం మంజూరు చేయాలని. కోరుతూ దీనికి సంబంధించిన నివేదిక కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపించామని పరిశీలించి ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
దీంతోపాటు నూతనంగా ఏర్పడిన ఎండపల్లి మండలంలో తాసిల్దార్ కార్యాలయ భవన నిర్మాణం కు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇదే వేదికపై ఉన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ , బీర్పూర్ మండల కేంద్రంలో తాసిల్దార్ భవన నిర్మాణంకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీర్పూర్, ఎండపల్లి మండల కేంద్రాలలో తాసిల్దార్ కార్యాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నానని ప్రకటించారు.
ధర్మపురిలో సబ్ రిజిస్టార్ కార్యాలయం ఏర్పాటుకు కలెక్టర్ పంపిన నివేదికను పరిశీలించి మంజూరు చేస్తానని మంత్రి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.