👉 శ్రీ నృసింహనవరాత్రోత్సవమలో..
J.SURENDER KUMAR,
ధర్మపురిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారికి అన్నకూటోత్సవము, సాయంత్రం పల్లవోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

ఉదయం శ్రీస్వామి వారికి పురుషసూక్త, శ్రీసూక్త, కల్పోక్త, న్యాసకపూర్వక షోడశ ఉపచార పూజ, నహాన్రనామార్చన, వంచోవనిషత్తులతో మరియు మన్యనూక్తముత్మోరియు రుద్రాభిషేకము పూజలు, విశేష పూజలు మరియు శ్రీస్వామి వారికి సప్త హారతులు, భజన కార్యక్రమములు నిర్వహించారు.

“శ్రీ నృసింహ అన్నకూటోత్సవము సందర్భముగా పలు రకముల పులిహోరాలు, దద్దోజనము, బజ్జిలు, వండ్లతో మహా నివేదన కార్యక్రమము నిర్వహించారు. సాయంత్రం పల్లవోత్సవం, వసంతోత్సవములలో భాగంగా శ్రీస్వామి లక్ష్మి అమ్మవారికి పలు రకముల పండ్ల రసములతో అభిషేకము, వైభవముగా నిర్వహించారు. తదుపరి సప్తహారతులు, వేదమంత్రపుష్పం, భజన కార్యక్రమములు జరిగాయి.

ఆలయ అర్చకులు, వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ, ప్రవీణ్ కుమార్ శర్మ, ఉపప్రధాన అర్చకులు నేరేళ్ళ శ్రీనివాసాచార్యులు, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచార్యులు, సిహెచ్ రమణయ్య, అర్చకులు నంబి నర్సింహమూర్తి, నేరేళ్ళ సంతోష్ కుమార్, వొద్దిపర్తి కళ్యాణ్, సముద్రాల వంశీ, చక్రపాణి కిరణ్, అభిషేక పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్, బొజ్జ సంపత్ కుమార్, బొజ్జ రాజగోపాల్ శర్మ, కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, అధ్యక్షులు జె. రవీందర్, ధర్మకర్తలు, సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ పాల్గొన్నారు.

👉 భారత సైన్యానికి మద్దతుగా ప్రత్యేక పూజలు !
ఆపరేషన్ సింధూర్ లో ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా కమిషనర్ స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి కి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.

ఇదే స్ఫూర్తితో మన దేశ సైనికులు ముందడుగు వేసి మనకు విజయాన్ని చేకూర్చాలని స్వామివారిని అర్చకులు వేద పండితులు కోరారు.