J.SURENDER KUMAR,
పదవి విరమణ చేసిన దేవాదాయ రీజినల్ మాజీ జాయింట్ కమిషనర్ ధర్మపురి క్షేత్రానికి చెందిన
కశొఝల శివరాం శర్మ ( 75 ) శుక్రవారం మృతి చెందారు. శర్మ అంతిమ దహన సంస్కారాలు శనివారం సాయంత్రం ధర్మపురి గోదావరి నది ఆయన కుమారుడు చంద్రశేఖర్ శర్మ నిర్వహించారు.
ఉమ్మడి రాష్ట్రంలో వేములవాడ, యాదగిరిగుట్ట ధర్మపురి తదితర ప్రముఖ ఆలయాల కార్యనిర్వహణాధికారి గా విధులు నిర్వహించి తనదైన గుర్తింపు పొందారు. తాను విధులు నిర్వహించిన ఆలయాల్లో సనాతన సాంప్రదాయ ఆచార పద్ధతిలో విధి విధాయకంగా స్వామివార్ల కు పూజాది కార్యక్రమాలు నిర్వహించేలా అర్చకులు, వేద పండితులను చైతన్య పరిచేవాడు.
ప్రత్యేకంగా ధర్మపురి ఆలయంలో భక్తులకు నిత్య ఉచిత అన్నదాన పథకాన్ని సాహసోపేతంగా ప్రారంభించిన ఘనత ఆయనకే చెందుతుంది. ప్రస్తుతం ధర్మపురి ఆలయంలో నిత్యం వందలాదిమంది భక్తులు అన్నదాన ప్రసాదం స్వీకరిస్తున్నారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా ధర్మపురి క్షేత్రంలో దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో గల బ్రహ్మ పుష్కరిణిలో ( కోనేటిలో ) సాయంత్రం వేళ వేలాది ప్రమిదలలో నూనె దీపాలు వెలిగించి ( భక్తుల ద్వారా విరాళాలతో ఆదాయంపై ఆర్థిక భారం పడకుండా ) ధర్మపురి క్షేత్ర ప్రాశస్త్యాన్ని విస్తృతస్థాయిలో ప్రచారం జరిగింది. ప్రస్తుతం సహస్ర దీపాలంకరణ తిలకించడానికి వేలాది మంది భక్తులు ధర్మపురికి తరలి వస్తుంటారు.
దేవాదాయ శాఖ డ్రెస్ కోడ్ అమలు చేయకముందే , కార్యనిర్వహణాధికారి హోదాలో విధులు నిర్వహించే ఆలయాలలో సాంప్రదాయ దుస్తులు ధరించి ( ధోతి, ఉత్తర్యం ) విధులను పర్యవేక్షించేవారు. శివరాం శర్మ, తండ్రి రాజన్న శాస్త్రి, ప్రముఖ పురాణ ప్రవచకుడు , శివరామ్ , రుద్రం, తదితర వేదమంత్రాలు బాల్యంలోనే అభ్యసించారు. దేవదాయ శాఖ విధుల్లో చేరకముందు తాత్కాలికంగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సంస్కృతి ఆంధ్ర కళాశాలలో క్లర్క్ గా విధులు నిర్వహించారు.
శివరాంశర్మ కుమారుడు చంద్రశేఖర్ శర్మ అమెరికా లో హిందూ ఆలయాలను నిర్మించి తెలుగు రాష్ట్రాల యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. అమెరికాలో చంద్రశేఖర్ శర్మ ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నాడు.
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్, చంద్రశేఖర్ శర్మ శిష్యుడు, జో బై డన్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన సందర్భంలో. అనేక మీడియా చానల్స్, ప్రచార సాధనాలు, చంద్రశేఖర్ శర్మ ఇంటర్వ్యూలను ప్రసారం చేశాయి. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, స్థానిక బ్రాహ్మణ సంఘం, నాయకులు, ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు శివరాంశర్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.