👉 ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి మేరకు !
J.SURENDER KUMAR,
దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్న సువిధ టాయిలెట్లు ( ప్రకృతి అవసరాలు తీర్చుకునే కేంద్రాలు ) ధర్మపురి, వేములవాడ పుణ్యక్షేత్రాలను ఎంపిక చేశారు.
స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, లక్ష్మణ్ కుమార్ గత రెండు నెలల క్రితం ధర్మపురి క్షేత్రంలో సువిధ టాయిలెట్స్ ఏర్పాటు కోసం మున్సిపల్ కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి, దాన కిషోర్ కు విజ్ఞప్తి చేశారు.
సామాన్య ప్రజలు సైతం ప్రకృతి అవసరాలు తీర్చుకునేందుకు అందుబాటులో ఉండే సువిధ టాయిలెట్స్ ఎంపిక కోసం నెల రోజుల క్రితం వేములవాడ, ధర్మపురి, జమ్మికుంట, నార్సింగ్ శంకర్ పల్లి ,యాదాద్రి మున్సిపల్ కమిషనర్ లతో రాష్ట్ర మున్సిపల్ శాఖ కీలక అధికారి సమీక్ష నిర్వహించారు.
ధర్మపురి, వేములవాడ కమిషనర్లు సువిధ టాయిలెట్ అవసరాలు, నిత్యం వేలాదిమంది భక్తుల రాకపోకలు, వారి అవసరాలను విపులంగా వివరించినట్లు సమాచారం.
గత వారం రోజుల క్రితం సంబంధిత శాఖ కీలక అధికారులు ధర్మపురి, వేములవాడ క్షేత్రాల్లో పర్యటించారు.
సోమవారం ధర్మపురి ,వేములవాడ కమిషనర్ లు ముంబైలో సువిధ టాయిలెట్ కాంప్లెక్స్ ను అక్కడి అధికారులతో కలసి డేమో , అవగాహన సమీక్షకు హాజరయ్యారు.
👉 ప్రత్యేకతలు..
సువిధ కేంద్రం మహిళలు, పిల్లలు, పురుషులు, వికలాంగులకు సమగ్ర, సురక్షితమైన, పరిశుభ్రమైన మరియు దుర్వాసన లేని సేవలను అందిస్తుంది.
👉 సౌరశక్తితో నడిచే కేంద్రాలు మహిళల టాయిలెట్‌లో షవర్ సౌకర్యాలు,
హ్యాండ్‌వాషింగ్ స్టేషన్లు,
స్వచ్ఛమైన తాగునీరు,
శానిటరీ నాప్‌కిన్ డిస్పెన్సర్‌లను కూడా అందిస్తాయి.
24×7 నడిచే సురక్షితమైన టాయిలెట్లు,
శుద్ధి చేసిన తాగునీరు, షవర్లు మరియు లాండ్రీ సేవలు అందుబాటులో ఉంటాయి.
👉 దాదాపు 240 చదరపు గజాలలో నిర్మితం కానున్న సువిధ టాయిలెట్స్ లో దాదాపు 5 గదులు అందుబాటులో ఉంటాయి.
స్నానాల గదులు, డ్రెస్సింగ్ రూమ్ లో, లాకర్ సౌకర్యం, వెయిటింగ్ హాల్ లాంటి సౌకర్యాలు సామాన్యుడికి అందుబాటులో ఉండే సరసమైన ధరలు ఉంటాయి.
సువిధ మంజూరుతో ధర్మపురి, వేములవాడ, క్షేత్రాలకు నిత్యం వచ్చే భక్తుల ప్రకృతి అవసరాల కష్టాలు తీరనున్నాయి..