దళిత స్పీకర్ ను అధ్యక్ష అనడానికి అహం అడ్డు వస్తున్నది !

👉 కెసిఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం అదే !

👉 దళిత వ్యతిరేకి బిఆర్ఎస్ పార్టీ !

👉 ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


అసెంబ్లీలో  దళిత వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ స్పీకర్ గా ఉండడంతో సమావేశాల్లో ‘ అధ్యక్ష ‘ సంబోధించడానికి ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం కెసిఆర్ కు అహం అడ్డు వస్తున్నందునే కెసిఆర్ అసెంబ్లీకి రావడం లేదని  ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.

మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, సీఎం రేవంత్ రెడ్డి    పై, కాంగ్రెస్ పార్టీపై చేసిన ఆరోపణలకు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ శుక్రవారం ధర్మపురిలో తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన  మీడియా సమావేశం లోమాజీ మంత్రి ఈశ్వర్ , పై టిఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

👉 ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశంలో పాయింట్స్..

👉బిఆర్ఎస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని గతంలో కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడిగా దళిత నాయకుడు, ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్ ను ప్రతిపక్ష నేతగా గుర్తించడానికి అహం అడ్డొచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మూటల, పదవులు ఆశ చూపి కొనుగోలు చేసి గుర్తింపు లేకుండా చేసిన  చరిత్ర  కెసిఆర్ ది అన్నారు.

👉 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో తుమ్మిడి హెట్టి – చేవెళ్ల ప్రాజెక్టుకు వైయస్సార్ హాయంలో పనులకు శ్రీకారం చుడితే, ఆ ప్రాజెక్టును అంబేద్కర్ పేరును రద్దుచేసి కాలేశ్వరం నామకరణం చేసింది మాజీ సీఎం కేసీఆర్ కాదా ? అని ప్రశ్నించారు.

👉 అప్పటి సీఎం కెసిఆర్ మీడియా సమక్షంలో నిన్ను చెయ్యి పట్టుకొని పక్కకు లాగి అగౌరపరిచిన  కనీసం దాని మీద నీవు స్పందించలేదు, నేను నీ స్థానంలో ఉండి ఉంటే వెంటనే నా పదవికి రాజీనామా చేసే వాడిని అన్నారు.

👉బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత డిప్యూటీ సీఎం రాజయ్య ను కెసిఆర్ ఎందుకు తొలగించారు ? దానికి కారణం నేటికీ చెప్పడం లేదన్నారు.

👉 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ తోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఆ రాష్ట్రానికి సీఎం అయిన కేసీఆర్ గత తొమ్మిదిన్నర సంవత్సరాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి, వర్ధంతికి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించిన సందర్భం లేదన్నారు.

👉 కేటీఆర్, హరీష్ రావు, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ రావు, కవితా రావు, సంతోష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కౌశిక్ రెడ్డి వీళ్ళ కూటమిలో టిఆర్ఎస్  బీసీ ఎస్సీ, ఎస్టీల నాయకుల స్థానం ఏమిటి ? అని  ప్రశ్నించారు.

👉 ఉమ్మడి కరీంనగర్ జిల్లా నీటిని సిద్దిపేట హరీష్ రావు దొర, సిరిసిల్ల కేటీఆర్ దొర, గజ్వేల్ కెసిఆర్ దొర తరలించకపోతే  ప్రభుత్వ విప్ గా మంత్రిగా ఎందుకు ప్రశ్నించలేదన్నారు.

👉 సిరిసిల్లలో అక్రమ ఇసుక లారీలు అడ్డుకుంటే దళితులను మీ ప్రభుత్వంలో దారుణంగా కొట్టితే కనీసం విప్ హోదా లో  బాధితులను పరామర్శించావా ? అంటూ ప్రశ్నించారు.

👉 టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్ పేరు ప్రతిపాదనలో ఉందని కేటీఆర్, హరీష్ రావు, కవితరావు, పల్లా రాజేశ్వర్ రెడ్డితో కనీసం ప్రకటనైన ఇప్పించగలుగుతావా ? పిసిసి అధ్యక్షుడిగా నా పేరు రెండవ స్థానంలో పరిశీలనలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ  అగ్ర నాయకత్వం దృష్టికి గతంలో వెళ్లిందన్నారు.

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  పై కాంగ్రెస్ పార్టీ పై ఆరోపణలు చేయడానికి ఈశ్వర్ కు అర్హత లేదని, సూర్యుడు మీద  ఉమ్మి వేస్తే అది నీపై పడుతుందని గుర్తుంచుకోవాలన్నారు.

👉 సీఎంను దొంగ, లంగా నోటికి ఏది పడితే అది,ఎంత పడితే అంత ఇష్టానుసారం ఆరోపణలు చేస్తున్న  నీకు నీ కేసీఆర్  నేర్పించిన భాష సభ్యత ఇదేనా అని ప్రశ్నించారు. కోరుట్ల ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ లేఖలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోటో కత్తిరించి లబ్ధిదారులకు ఇవ్వడం ఇదేనా మీ టిఆర్ఎస్ పార్టీ సంస్కృతి సభ్యత అన్నారు.

👉 తెలంగాణ  ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, స్పీకర్, డిప్యూటీ సీఎం , వైద్య ఆరోగ్యశాఖ మంత్రి , ప్రభుత్వ విప్ దళితులు, ఆదివాసి మహిళ మంత్రి. ఉన్నారని, టిఆర్ఎస్ హయంలో కనీసం మిమ్మల్ని కేసీఆర్ పక్కన కూర్చో పెట్టుకున్నాడా ? అంటూ ప్రశ్నించారు.

👉  రోళ్ళ వాగు ప్రాజెక్ట్ టెండర్ అగ్రిమెంటు పూర్తయిన ఎస్ కె ఎన్ ఆర్ కాంట్రాక్టు సంస్థ ను కమిషన్లకు కోసం కక్కుర్తిపడి సంవత్సర కాలంగా పనులు చేయకుండా అడ్డుకున్నది మీరు కాదా ?  ఆ ప్రాజెక్టు అంచనా నేడు ₹ 160 కోట్లకు పెరిగింది వాస్తవం కాదా ? అటవీ శాఖ  క్లియరెన్స్ మంత్రి హోదాలో ఎందుకు సాధించలేదు అని ప్రశ్నించారు.

👉 2014 నుండి  దళిత వర్గాన్ని  చిన్నచూపు చూశారు కాబట్టే ప్రజలు 2023 లో మీ పార్టీకి మీకు బుద్ధి చెప్పారు అని అన్నారు. మాజీ మంత్రి ఈశ్వర్ ఎస్సీ అగ్రికల్చరల్ కాలేజీని స్తంభంపెల్లికి తీసుకువచ్చినట్టు ఒక జీవో కాపీని చూపిస్తే నేను దేనికి అంటే దానికి సిద్ధం అన్నారు.

👉 మేడారం నుండి నీటిని దోచుకెళ్లిన,అదనపు టీఎంసీ పేరుతో వెల్గటూర్ వద్ద విలువ గల భూములను తక్కువ ధరకు లాక్కొన్న కనీసం మంత్రి హోదాలో రైతుల పక్షాన మాట్లాడలేదన్నారు.  ధర్మపురిలొ సివరేజ్ ప్లాంట్ ఏర్పాటు చెయ్యలేదు, డిగ్రీ కళాశాల, తేలేదు, తెలుగు కళాశాలను మూత వేయించావు. ధర్మపురి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయలేదన్నారు.

👉 సీఎం రేవంత్ రెడ్డి 15 నెలల ప్రజా పాలన ప్రభుత్వంలో రైతులకు ₹ 2 లక్షల రుణమాఫీ, కులగణ సర్వే, ఎస్సీ వర్గీకరణ, భూభారతి చట్టం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ₹500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సన్న వడ్లకు ₹500 బోనస్, 56 వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకం. తదితర అభివృద్ధి పనులు చేపడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పై ఆరోపణలు చేసే అర్హత ఈశ్వర్ కు లేదన్నారు.

👉 నియోజకవర్గంలో సంక్షేమ మంత్రిగా కొనసాగిన కాలంలో ఒక్క నూతన హాస్టల్ భవన నిర్మాణం చేశారా ?   అంటూ ప్రశ్నించారు. 2004 నుంచి పెండింగ్ లో ఉన్న చెగ్యం గ్రామముంపు బాధితులకు ₹ 18 కోట్ల పరిహారం ఇప్పించాను, సీవరేజ్ ప్లాంట్ ఏర్పాటుకు ₹ 17 కోట్ల, తాగునీటి కోసం ,₹ 3.60 కోట్లు ఖర్చు చేశాను. మంజూరు, ధర్మారంలో ఐటిఐ కళాశాల, రోడ్డు ప్రమాద బారినపడిన క్షతగాత్రులకు  ట్రామా వైద్య కేంద్ర ఏర్పాటు  వివిధ గ్రాంట్ల కింద నిధులు మంజూరు చేసి సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం,ఎక్కడ అవసరం ఉంటే అక్కడ బోర్స్ వేయించడం వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు.

👉 కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ పార్టీ పై మా ముఖ్యమంత్రి పై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలి అన్నారు.

👉 లక్ష్మణ్ కుమార్ నాకు అసలు పోటీ కాదని, అహంకారపూరిత  మాటలు మాట్లాడిన కొప్పుల ఈశ్వర్, రానున్న పుష్కరాల సమయానికి  ధర్మపురి  అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ సవాల్ చేశారు.