J.SURENDER KUMAR
వరి ధాన్యం కొనుగోలు కేంద్రంనికి స్థలం కేటాయిస్తానని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ రైతాంగానికి హామీ ఇచ్చారు.
ధర్మపురి మండలంలోనీ నేరేళ్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాని స్థానిక ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.
👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి స్థలం కావాలని నాకు వివరించారు, కలెక్టర్ తో చర్చించి వివాద రహిత భూమి మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే అన్నారు.
రైతులకు ఎటువంటి ఇబ్బందులు నష్టం వాటిల్లకుండా ధాన్యం కొనుగోళ్లు కొనసాగించాలని అధికారులను ఎమ్మెల్యే కోరారు.

SDF ఫండ్స్ కింద గన్ని బ్యాగ్స్ పెట్టుకోవడానికి గదిని నిర్మించి ఇస్తానని ఎమ్మెల్యే రైతులకు వివరించారు. తాలు, తప్ప, తరుగు, పేరిట ధాన్యం తూకంలో కోత విధిస్తే చట్ట పరంగా కఠిన చర్యలు బాధ్యులపై తీసుకుంటామని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో పాలకవర్గ సభ్యులు,అధికారులు ,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.