దుకాణాలను పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు !

J.SURENDER KUMAR,


సరస్వతి పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లు శుక్రవారం మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు.


👉 సరస్వతి పుష్కరాల నేపథ్యంలో పుష్కర ఘాట్ల వద్ద భక్తులకు అందుబాటులో ఉండే సదుపాయాలను, సేవలను సమీక్షించేందుకు మంత్రి శ్రీధర్ బాబు  విస్తృతంగా పర్యటించారు. ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లు, భక్తులకు సరఫరా చేసే తాగునీరు, ఆరోగ్య సదుపాయాలు, భద్రత ఏర్పాట్లను సమీక్షించారు.


👉 ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.


👉 రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతుందని అధికారు లు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.


స్వచ్ఛత, ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే, శాసన సభ్యులు మక్కన్ సింగ్, పరిశ్రమల శాఖ జిఎం సిద్దార్థ, డిఆర్డీఓ నరేష్,  తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాళ్లు ఏర్పాటు చేసిన వారితో ఫోటటోలు దిగి అభినందించారు.
👉
మంత్రి శ్రీధర్ బాబు దుకాణాల పరిశీలన దృశ్యమాలిక !