J.SURENDER KUMAR,
రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో అర్హత కలిగిన దేవాలయాల నుంచి ధూపదీప నైవేధ్య పథకానికి దరఖాస్తులు చేసుకోవాలని తెలంగాణ దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్రావు మే 1న అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ పథకం ద్వారా ఎంపిక చేసిన ఆలయాలకు నెలకు ₹ 4 వేలు, అర్చకునికి నెలకు ₹.6 వేలు దేవాదాయ శాఖ తరపున చెల్లిస్తామని ఆ శాఖ డైరెక్టర్ తెలిపారు.

అర్హులైన వారు ఈనెల 24 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో కోరారు. కాగా, సదరు ఆలయం కనీసం పదిహేనేళ్ల క్రితం నిర్మించి ఉండాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.