👉 కలెక్టర్ రాహుల్ శర్మ !
J.SURENDER KUMAR,
పుష్కరాలకు వచ్చే భక్తులు కాళేశ్వరంలో టోల్ గేట్ చెల్లించొద్దని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. వాహనాలు రద్దీ నియంత్రణకు టోల్ గేట్ రద్దు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. భక్తుల వాహనాలకు టోల్గేట్ రద్దు చేసినట్లు వాహనాల నుంచి ఎలాంటి టోల్ గేట్ వసూలు చేయొద్దని ఆయన ఆదేశించారు.

సరస్వతి పుష్కరాల నేపథ్యంలో మూడో రోజున కాళేశ్వరానికి భక్తుల రద్దీ తీవ్రంగా పెరిగింది. వీకెండ్స్ కావడంతో వాహనాల్లో భారీగా భక్తులు కాళేశ్వరం చేరుకుంటున్నారు.
దీంతో మహదేవపూర్, కాళేశ్వరం రహదారిలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వాహనాలను క్రమబద్దీకరించేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ లు బైకుపై తిరుగుతూ వాహనాలను పంపించే పనిలో నిమగ్నం అయ్యారు.

శనివారం వేకువ జాము నుండే పెద్ద సంఖ్యలో వాహనాలు కాళేశ్వరం చేరుకుంటున్నాయి. శుక్రవారం అర్థరాత్రి ఈదురు గాలులు రావడంతో పుష్కర ఘాట్ తో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతులను పునరుద్దరించే పనిలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేలు నిమగ్నం అయ్యారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ అధికారులు తక్షణమే పునరుద్ధరణ పనులు చేపట్టి విద్యుత్ సరఫరా అందించారు.

అర్ధరాత్రి వచ్చిన ఈదురు గాలుల కారణంగా టెంట్లు నేలకూలిపోగా వాటిని సవరించే పనులను అర్ధరాత్రి నుండి ప్రత్యక్ష్యంగా కలెక్టర్, ఎస్పీలు హాజరయ్యారు.
ఈ క్రమంలోనే కాళేశ్వరం రహదారిలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయన్న సమాచారం అందుకున్న జిల్లా ఉన్నతాధికారులు ఇద్దరు తమ కాన్వాయిలను పక్కన పెట్టి బైకుపై తిరుగుతూ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టించారు. శని, ఆది వారాల్లో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంటుందని అంచనా వేసి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.