👉ఉప్పు’ కథనానికి స్పందన !
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా బీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధి అటవీ గ్రామం కందన కుంటలో అనుమానస్పదంగా మృతి చెందిన గిరిజన బాలిక మరణం వెనుక మర్మమును జగిత్యాల్ పోలీస్ యంత్రాంగం వెలుగు తీయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
విశ్వసనీయ సమాచార మేరకు గురువారం, శుక్రవారం, రెండు రోజులపాటు కొందరు మఫ్టి పోలీసులు గిరిజన తండా లో వివరాలు సేకరించినట్టు సమాచారం. బాలిక తల్లిదండ్రులకు మనో ధైర్యం కల్పించి జరిగిన సంఘటన తీరు తెన్నులు అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు కొంత మొత్తం నగదు తన ఇంటి నుంచి పోయినట్టు భయం భయంగా బాలిక తండ్రి వివరించి రోదించినట్టు తెలిసింది.
👉 వివరాల్లోకి వెళితే..

జగిత్యాల జిల్లా బీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధి కందనే కుంట ( నాయకపు గూడెం ) లో గత నెల 11 న గడ్డం వెంకటేష్ కూతురు (8) ఇంటిలో ( తడకల గుడిసె ) ఒంటరిగా ఉంది. తల్లిదండ్రులు గడ్డం వెంకటేష్ రజితలు బర్రెలు కాయడానికి అడవికి వెళ్లారు. మరో సోదరుడు స్వాత్విక్. పోరుగున ఉన్న నరసింహుల పల్లె పాఠశాలకు ( 7 వ తరగతి ) చిన్న కుమారుడు ( 3 ) తల్లిదండ్రుల తో వెళ్లాడు. వెంకటేష్ తల్లి మేకలు మేపడానికి అడవికి వెళ్ళింది. ఇంటిలో ఒంటరిగా ఉన్న చిన్నారి బాలిక చున్నీతో ఉరివేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే.

ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారా ? అనే విషయం తెలియని అమాయక గిరిజన దంపతులు భయాందోళన చెందారు. వారి ఆవేదన , రోదన తీరును
గత నెల 17న ‘ గిరిజన బాలిక మరణం వెనుక ఏం జరిగింది ? ‘ శీర్షికన ” ఉప్పు” వార్తా ప్రచురించిన విషయం తెలిసిందే.