20 లక్షల విలువగల ఫోన్లు బాధితులకు అందజేత !

👉 మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in CEIR  అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి !

👉 జగిత్యాల జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ ,

J.SURENDER KUMAR,

సెల్ ఫోన్  పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ  అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పోగొట్టుకున్న, చోరి గురైన 102  మొబైల్ ఫోన్లను ( సుమారు ₹ 20   లక్షల విలువగల ) స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ… పోయిన సెల్ ఫోన్ పట్ల  అశ్రద్ధ చేస్తే ఇది వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి CEIR వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. CEIR  వెబ్సైట్లో వినియోగదారులు వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ ని ఈ పోర్టల్  ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు.

పోయిన సెల్ ఫోన్ల రికవరీ కోసం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో  RSI, హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుల్ లతో ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరగిందని అన్నారు.
ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 986 ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని అన్నారు.

CEIR ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎవరికైనా సెల్ ఫోన్ దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా సూచించారు.

ఈ సందర్భంగా సాంకేతికతను ఉపయోగించి మొబైల్ ఫోన్లో రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఐటి కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్ CEIR టీం, RSI కృష్ణ ,హెడ్ కానిస్టేబుల్ మహుముద్ , కానిస్టేబుల్ లు అజర్ యాకూబ్, మల్లేశం లను జిల్లా ఎస్పీ  అభినందించారు.


ఈ సందర్భంగా బాధితులు తమ యొక్క ఫోన్ పోయినా వారు ఫోన్ పోయినప్పుడు అవలంబించిన విధానాన్ని తెలియజేశారు. సాంకేతికతను  ఉపయోగించి పోయిన సెల్ఫోన్లను తిరిగి కనిపెట్టి తమకు ఇచ్చినందుకు బాధితులు ఎస్పీ కి  కృతజ్ఞతలు తెలిపారు.

👉 జగిత్యాల జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు !

👉 ఎస్పీ  అశోక్ కుమార్ !



జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల  (మే 1వ తేది నుండి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్  అమలులో ఉంటుందని జగిత్యాల జిల్లా ఎస్పీ   ప్రకటించారు.
దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని అన్నారు . శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా మరియు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్.పి  సూచించారు.
జిల్లా ప్రజలు పోలీసు వారికి ఇట్టి విషయంలో సహకరించాలని శాంతిభద్రతల పరిరక్షణ కు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని కోరారు.