జగిత్యాల ఆసుపత్రికి M R I స్కాన్ మంజూరు !

👉 హెల్త్ కేర్ హబ్ గా జగిత్యాల..

👉 ధర్మపురి పరిధిలో ట్రామా కేర్ సెంటర్ ను  ఏర్పాటు

👉 ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల ప్రాధాన్యం ఇవ్వండి.!

👉 డాక్టర్లు విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు !

👉 వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ !

J.SURENDER KUMAR,

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్  గా తీర్చి దిద్దటానికి అన్ని చర్యలు  తీసుకుంటామని రాష్ట్ర  వైద్య  ఆరోగ్య శాఖ మంత్రి  దామోదర్. రాజా నరసింహ పేర్కొన్నారు.

👉 ఆదివారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో మెడికల్ & హెల్త్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ డీఎంఈ పరిధిలో ఉన్న ఆస్పత్రుల బలోపేతం పై ఆయా విభాగాల అధికారులతో సుధీర్గంగా చర్చించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన అన్ని వివరాలను మంత్రి దామోదర్ రాజనర్సింహ అడిగి తెలుసు కున్నారు.

👉 ఈ  సందర్భంగా వైద్యశాఖ అధికారుల నుంచి ఆసుపత్రులు పనితీరు వైద్యుల సేవలు.. ప్రజల స్పందన.. ఇబ్బందులు.. దవాఖానాల్లో నెలకొన్న సమస్యలను మంత్రి క్షుణ్ణంగా తెలుసుకున్నారు.

👉 ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ


జిల్లా లో అవసరమైన వైద్య  పరికరాలు  అందజేస్తామన్నారు. జగిత్యాల జనరల్ హాస్పిటల్ కు ఎమ్మారై స్కాన్  ను. మంజూరు చేస్తామని  తెలిపారు. జిల్లాలో గల మూడు డయాలసిస్ సెంటర్లలో రోగులకు అత్యుత్తమైన సేవలు అందించా లని, వారి పట్ల నిర్లక్ష్యంగా ఉండవద్దని సూచించారు.

👉 ఉత్తర తెలంగాణ కు  కీలక  జిల్లా అయిన  జగిత్యాల  జిల్లాను వైద్య పరంగా మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. వైద్యులు బాధ్యతయుతంగా  పని. చేయాలని,  విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే  కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు 

👉 ప్రభుత్వ ఆసుపత్రుల్లో  నూటికి  నూరు. శాతం  డెలివరీ లను  ప్రోత్సాహించాలని ఆదేశాంచారు . ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెరిగేలా వైద్యాధికారులు సిబ్బంది ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు. ఇందుకు గ్రామ గ్రామాన అంగన్వాడి కార్యకర్తలు ఆశా వర్కర్లు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.

👉 రోడ్  ప్రమాద  బాధితులకు జగిత్యాల  ధర్మపురి పరిధిలో ట్రామా కేర్ సెంటర్ ను  ఏర్పాటు. చేస్తామనీ వెల్లడించారు.  జిల్లా లో  సెంట్రల్  డ్రగ్  సెంటర్  ను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.

👉 డ్రగ్ సెంటర్ నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. జగిత్యాల డయాలసిస్ సెంటర్లో రోగులకు మరింత అత్యుత్తమైన సేవలు అందేలా పకడ్బందీగా వైద్యులు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

👉 ఆస్పత్రుల్లో వైద్యులు రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, వారి పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ అత్యుత్తమైన సేవలందించాలని సూచించారు.

👉 సకాలంలో వైద్య సేవలు అందించని వైద్య అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అయితే అధికారులు, సిబ్బంది పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని, ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలు అందించి ప్రభుత్వ ఆసుపత్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

👉 ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని, ప్రభుత్వాసుపత్రుల్లో అత్యాధునికమైన అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలంతా వాటిని సద్విని చేసుకోవాలని కోరారు. ప్రభుత్వాసుపత్రులను మరింత ప్రజల ఆదరించాలని తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

ఈ సమీక్షలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కోరుట్ల శాసనసభ్యులు డా. సంజయ్, జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, అదనపు కలెక్టర్ బిఎస్ లత డిఎం అండ్ హెచ్ ఓ డా. ప్రమోద్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డా. ఖాద్రి జి జి హెచ్  హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. సుమన్, జిల్లా కు చెందిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.