👉 చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల మండలాలలో..
👉 పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, విప్ ఆది శ్రీనివాస్ !
👉 కలెక్టర్ బి సత్యప్రసాద్ తో కలిసి ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు అందజేత !
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లాలో బుధవారం తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరి పత్రాలను చొప్పదండి, వేములవాడ ఎమ్మెల్యే లు మేడిపల్లి సత్యం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి పంపిణీ చేశారు.
చొప్పదండి నియోజకవర్గం లోని కొడిమ్యాల మండలం అక్షయ గార్డెన్ లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది.

కొడిమ్యాల మండలంలో మంజూరైనవి 437 ఇందిరమ్మ కింద పత్రాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, 436 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల రెవిన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్ హౌసింగ్ ప్రత్యేక అధికారి మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్ హౌసింగ్ పి డి ప్రసాద్ ఎమ్మార్వో ఎంపీడీవో మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు .
👉 వేములవాడ నియోజకవర్గం లో…

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం P N R గార్డెన్ లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. మేడిపల్లి మండలంకు మంజూరు అయినవి 246 ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లబ్ధిదారుల 154 మందికి మంజూరి పత్రాలు పంపిణీ చేశారు. భీమారం మండలం కు 151 మంజూరు కాగా ఇందులో 128 పంపిణీ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో కోరుట్ల మరియు మెట్పల్లి రెవెన్యూ డివిజన్ అధికారులు జివాకర్ రెడ్డి, శ్రీనివాస్, మేడిపల్లి మండల్ భీమారం మండల్ ఎమ్మార్వోలు. ఎంపీడీవోలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు .