👉 428 కొనుగోలు కేంద్రాల ద్వారా 65554 మంది రైతుల వద్ద !
👉 54132 మంది రైతుల ఖాతాలో ₹ 723.46 కోట్ల జమ చేశాం !
👉 రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుంది !
👉 ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లాలో 428 వడ్ల కొనుగోలు కేంద్రాల ద్వారా గురువారం నాటికి 65554 మంది రైతుల నుండి 3.88 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామని, రైతుల ఖాతాలోకి కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు ₹ 723.46 కోట్ల రూపాయలను 54132 మంది రైతుల ఖాతాలో జమ చేశామని, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం రోజున వివిధ శాఖల అధికారులతో ధాన్యం కొనుగోలు, కొనుగోలు చేయాల్సింది ఎంత ? ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలో జమ చేశారా ? కొనుగోలు కొనుగోలు చేయాల్సిన ధాన్యం ఎంత ? తదితర అంశాలపై ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్ష నిర్వహించారు.
👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

జిల్లాలో గురువారం నాటికి కొనుగోలు చేసిన 3.88 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం డబ్బులు ₹ 723.46 కోట్ల రూపాయలను 54132 మంది రైతుల ఖాతాలో జమ చేశామన్నారు.
👉 మిగిలిన రైతుల ఖాతాలో సైతం త్వరలో డబ్బులు జమ చేస్తామన్నారు. కేంద్రాల వద్ద ఇంకా 15 శాతం వడ్లు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయని, ఎమ్మెల్యే తెలిపారు.
👉 గత BRS ప్రభుత్వ హయంలో రైతులు తమ వడ్లు ఎప్పుడూ కొనుగోలు చేస్తారో ? అని ఎదురు చూసే పరిస్థితి ఉండేది అన్నారు. ప మన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్దతు ధరతో గ్రేడ్ A రకానికి క్వింటాల్ ₹ 2320 రూపాయలు, సాదారణ రకానికి ₹ 2300 రూపాయలు, సన్న రకాలకు ₹ 5 వందల బోనస్ లు అదనంగా చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేయడం చేస్తున్నామన్నారు.
👉 నిన్నటి నుండి కురుస్తున్న అకాల వర్షాలకు ధాన్యం తడవడం జరిగిందనీ, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. మిగిలిన ఆ 15 శాతం వడ్లను కూడా హామలీల సంఖ్యను అదనంగా పెంచి కొనుగోళ్ళు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని ఎమ్మెల్యే వివరించారు.
👉 గత ప్రభుత్వ పాలకులు రైతుల గూర్చి పట్టించుకోలేదని, గతంలో మంత్రిగా కొనసాగిన కొప్పుల ఈశ్వర్ వద్దకు రైతులు వెళ్ళి మిల్లర్లు కటింగ్ పేరుతో దోచుకుంటున్నారు అని వేడుకున్న, మీరు రైస్ మిల్లర్స్ తో మాట్లాడుకోండి అంటూ నిర్లక్ష్యంగా రైతులతో అన్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.
👉 మన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఎక్కడ రైతులకు ఇబ్బందులు కలిగించకుండా, ఎక్కడ తాలు తప్ప పేరిట కటింగ్ లేకుండా పారదర్శకతతో జిల్లా అధికారుల పర్యవేక్షణలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు.
రైతుల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని, గత ప్రభుత్వంలో రైతులుకు ట్రక్ షీట్లు, ధర్మ కంట రసీదులు ఇచ్చేవారు కాదని, ఒక సంచికి 6 నుండి 9 కిలోల వరకు ధాన్యం కటింగ్ చేశారు అన్నారు.
👉 ప్రస్తుతం నిబంధనలకు అనుగుణంగా పూర్తిగా అధికారుల పర్యవేక్షణలో ధాన్యం కొనుగోలు చేపట్టడం జరుగుతుందని, ఇంకా ఎక్కడైనా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో కూడా ఆ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వం స్థలంలో కేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని, రానున్న రోజుల్లో కూడా విత్తనాలు, ఎరువుల సరఫరాలో జాప్యం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
👉 కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ !

ధర్మపురి ఎంపీడీవో కార్యాలయంలో ₹ 54 లక్షల విలువగల కళ్యాణ లక్ష్మీ , షాది ముభారక్ చెక్కులు అర్హులైన 54 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అందించారు.