జర్నలిస్టుల సంక్షేమం కోసం మీడియా అకాడమీ కృషి చేస్తుంది !

👉 మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాసరెడ్డి !


J.SURENDER KUMAR,

జర్నలిస్టుల వృత్తి నైపుణ్యం పెంచడంతోపాటు విధి నిర్వహణలో , అనారోగ్యం వివిధ కారణాలతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాల సంక్షేమం కోసం తెలంగాణ మీడియా అకాడమీ కృషి చేస్తుందని అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి అన్నారు.


ఇటీవల రాష్ట్రంలో అకాల మరణానికి గురైన 38 మంది జర్నలిస్టులతో పాటు ప్రమాదాలకు, అనారోగ్యలకు గురై మంచం పట్టిన 8మంది జర్నలిస్టులకు  శుక్రవారం హైదరాబాదులో సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిల  బాధిత కుటుంబాలు చెక్కులను అందించారు.


తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే) అండగా నిలిచింది. తెలంగాణ మీడియా అకాడమీ నుండి అందించే ఆర్థిక సహాయానికి బాధిత కుటుంబాల చేత టీయూడబ్ల్యూజే దరఖాస్తులు సమర్పించింది.


ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కే. రాంనారాయణలతో పాటు ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం.ఏ. మాజీద్, రాష్ట్ర కార్యదర్శులు కే.శ్రీకాంత్ రెడ్డి, జి.మధుగౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ. రాజేష్, బి. కిరణ్ కుమార్, గౌస్, రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు, హెచ్.యూ.జే అధ్యక్షులు శిగా శంకర్ గౌడ్ లు పాల్గొన్నారు
.