👉 అనుక్షణం అప్రమత్తం అధికార యంత్రాంగం !
J.SURENDER KUMAR,
ఆదివారం సెలవు దినం కావడంతో పుష్కర స్నానాలకు తరలివచ్చిన వచ్చిన భక్తులతో
కాలేశ్వర క్షేత్రం జనసంద్రంగా మారింది. అధికార యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ భక్తజనంకు సేవలందిస్తున్నారు.

కలెక్టర్ రాహుల్ శర్మ సరస్వతి ఘాట్, భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్న త్రివేణి సంగమం, ఆరోగ్య శిభిరం, కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ, పరిసరాలలో కాలినడకన కలియ తిరుగుతూ వాకి టాకీతో అధికారులను, పుష్కర విధులు నిర్వహించే సిబ్బందిని అప్రమత్తం చేశారు.

👉 ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..
రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతున్నదని, రేపటి లోగా అదనంగా చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

👉పుష్కర స్నానానికి భక్తులు వెళ్లేందుకు అదనంగా తాత్కాలిక మరో రహదారి వేయాలని ఆదేశించారు.

👉 భక్తులు వ్యర్థాలు వేసేందుకు అదనంగా డస్ట్ బిన్స్ ఏర్పాటు చేయాలని డిపిఓ ను ఆదేశించారు. ఈ సందర్భంగా భక్తులను ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు. సంగమ ప్రాంగణం మొత్తం అపరిశుభ్రంగా ఉందని ఉందని, సాయంత్రం మళ్ళీ వస్తాను అప్పటీ లోగ ఈ ప్రాంతం మొత్తం శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు.

👉సంగమ ప్రాంతంలో అపరిశుభ్రత లేకుండా ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించి పరిశుభ్రం చేయాలని స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్, డిపిఓకు వాకిటాక్ ద్వారా సూచించారు.
👉 పారిశుధ్యం అద్వాన్నంగా ఉందని అదనపు సిబ్బంది ఏర్పాటు ద్వారా వ్యర్థాలను తొలగించాలని మళ్ళీ వస్తాను మార్పు రాకపోతే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

👉 భక్తుల రద్దీ పెరుగుతున్నదని దేవస్థానంలో స్వామి దర్శనానికి క్యూ లో ఉన్న భక్తులను దర్శనానికి ఎంత సమయం పడుతుందని అడిగి తెలుసుకున్నారు. భక్తులకు దర్శనం త్వరగా అయ్యేలా చూడాలని దేవస్థానం సిబ్బందిని ఆదేశించారు.
👉ఆలయ ప్రాంగణంలో భక్తులకు మంచినీళ్లు అందించాలని సూచించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. భద్రత, శుభ్రత, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అనుక్షణం అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

👉పుష్కర ఘాట్ లో అస్వస్థకు గురి అయిన భక్తుడిని స్టెర్చర్ ద్వారా ఆస్పత్రి కి తరలించారు
👉మొబైల్ వాహనం ద్వారా ORR ప్యాకెట్ల భక్తులకు పంపిణీ తీరును కలెక్టర్ పరిశీలించారు.

భక్తుల తాగునీటి సౌలభ్యం మూత్రశాలలు, మరుగుదొడ్లు శుభ్రత తదితర ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు.
పుష్కర ఘాట్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు, అపశృతులు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని గజఈతగాళ్ల ను , అక్కడ విధులు నిర్వహించే అధికారులను కలెక్టర్ ఆదేశించారు.