కాలేశ్వరంలో సరస్వతీ పుష్కరాలకు సర్వం సిద్ధం !

👉 గురువారం  ఉదయం 5:44 నిమిషాలకు వృషభ లగ్నంలో మిథున రాశిలో బృహస్పతి ప్రవేశంతో సరస్వతి పుష్కర ప్రారంభం !


👉 శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి మొదటి పుష్కర స్నానం !


J.SURENDER KUMAR,


కొన్ని గంటలలో ప్రారంభం కానున్న సరస్వతి పుష్కరాల కోసం వచ్చే భక్తజనం కు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసి కాలేశ్వరం క్షేత్రంలో సర్వం సిద్ధం చేశారు !

శ్లో॥ ప్రణీత వరదా వైణ్య గౌతమీచ సరస్వతి॥ సద్యః పంచ వహం త్యత్ర ప్రయాగా త్కోటి శోధికం ॥


తాత్పర్యము : – ప్రయాగా యందు గంగా యమునా సరస్వతి యను నదులు కలవు (కాళేశ్వరం క్షేత్రమందు) ప్రణీత, వరద మరియు వైన్య గౌతమి సరస్వతి యను నదులు కలవు కావున ఈ క్షేత్రం ప్రయాగ కంటే కోటిరేట్లు గొప్ప క్షేత్రం కాలేశ్వరం !


స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సర వైశాఖ బహుళ తదియ గురువారం  ఉ॥ 5:44 నిమిషాలకు వృషభ లగ్నంలో మిథున రాశిలో బృహస్పతి ప్రవేశంతో సరస్వతి పుష్కర ప్రారంభం కానున్నాయి


శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి ప్రత్యేక పూజలు చేసి  ముహూర్తానికి స్వామీజీ మొదటి స్నానం చేయనున్నారు.
12 సంవత్సరాలకు ఒకసారి జరిగే అరుదైన మహా పుష్కరాలకు నిత్యం లక్షలాదిమంది భక్తులు కాలేశ్వరం క్షేత్రానికి రానున్నట్టు యంత్రాంగం అంచనా !