కాళేశ్వరాన్ని అధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలి !

👉 కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ !


J.SURENDER KUMAR,


సోమవారం  కాళేశ్వరంలో  పుష్కర స్నానమాచరించి ముక్తేశ్వరుడిని దర్శించుకున్న బండి సంజయ్ కుమార్ దంపతులు


👉 ఈ సందర్భంగా మంత్రి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.


కుంభమేళాలో 50 కోట్ల మంది భక్తులకు అద్బుతమైన ఆతిధ్యమిచ్చామని తెలిపారు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు ₹ 35 కోట్లు మాత్రమే కేటాయించారని అట్టి నిధులు సరిపోవని మరిన్ని నిధులు కేటాయించాలన్నారు. 

కుంభమేళా సందర్భంగా 50 కోట్ల మంది భక్తులకు కేంద్ర ప్రభుత్వం అద్బుతమైన ఆతిథ్యమిచ్చిందని, కాళేశ్వరం పుష్కరాలకు విచ్చేసే 50 లక్షల మందికి ఆతిథ్యం ఇవ్వాలని అన్నారు.


సోమవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి బండి సంజయ్ సతీమణి బండి అపర్ణతో కలిసి కాళేశ్వరం విచ్చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులు కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పోలీస్ వందనాన్ని స్వీకరించారు. అనంతరం పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య బండి సంజయ్ దంపతులు సరస్వతి నదీమ తల్లి పుష్కర స్నానాన్ని ఆచరించారు.

అక్కడి నుండి నేరుగా సరస్వతి మాతను,  శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి  దంపతులకు పూజారులు ప్రత్యేక ఆశీర్వచనం అందించారు.       

 సరస్వతి పుష్కరాల సందర్భంగా ఈరోజు కాళేశ్వరం విచ్చేసి పుష్కర స్నానం ఆచరించడం చాలా సంతోషంగా ఉందని,  గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమని, 12 ఏండ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు హాజరై స్నానమాచరించడం ఆనందంగా ఉందని అన్నారు.

దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని, వారి కష్టాలన్నీ తొలగిపోవాలని, నరేంద్రమోదీ నాయకత్వంలో దేశానికి మరింతగా సేవలందించేలా దీవించాలని ఆ స్వామివారిని ప్రార్ధించినట్లు ఆయన తెలిపారు.