👉 దేశ రక్షణ కోసం కేంద్రం ఏ చర్యలు తీసుకున్న అండగా ఉంటాం !
👉 ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
అమాయక భారతీయులను దారుణంగా చంపిన ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న పాకిస్తాన్ దేశం కలలో సైతం భారతదేశం వైపు కన్నెత్తి చూడడానికి భయపడేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ సైన్యానికి సంఘీభావ ర్యాలీ శుక్రవారం ధర్మపురి పట్టణంలో నిర్వహించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక నంది చౌరస్తా నుండి గాంధీ చౌరస్తా వరకు సంఘీభావ ర్యాలీనీ జరిగింది.
👉 ఈ సందర్భంగా ర్యాలీ ఉద్దేశించి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

ఉగ్రవాదులు పెహల్గాం లో జరిపిన మారణ హోమంను తీవ్రంగా ఖండిస్తున్నాను అని అన్నారు. భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ సైనిక చర్యకు ఏఐసిసి అగ్రనాయకులు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన విషయం వివరించారు.
రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మా పార్టీ మద్దతుగా ఉంటుందన్నారు.
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించుకుంటూ మన దేశంపై దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పుతున్న ఆపరేషన్ సింధూర్ సైనిక చర్య పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.

సంఘీభావ ర్యాలీలో బిజెపి, కాంగ్రెస్, విశ్వహిందూ పరిషత్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.