కార్యకర్తల కష్టార్జితం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం !

👉 మంత్రి దామోదర రాజనర్సింహ !

J.SURENDER KUMAR,

తొమ్మిదినర సంవత్సరాల కాలం పాటు గత ప్రభుత్వంలో నరకం అనుభవించాం, కాంగ్రెస్ కార్యకర్తలు కష్టార్జితం, దమ్ము, ధైర్యం, తెగువ పోరాటంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ ఏసీ గార్డెన్ లో ఆదివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు.

👉 మంత్రి దామోదర రాజనర్సింహ ప్రసంగంలో హైలెట్స్ !

👉 నా బలంతోనే గెలిచాను మంత్రి అయ్యాను అనుకుంటే ఆ నాయకుడికి రాజకీయ భవిష్యత్తు ఉండదని, కార్యకర్తల కష్టార్జితం గుర్తిస్తేనే వారికి రాజకీయ మనుగడ ఉంటుంది !

👉 కాంగ్రెస్ కార్యకర్తలను సర్పంచులుగా  ఎంపీటీసీలు గా, ఎంపీపీలో జెడ్పిటిసి లోగా మేము గెలిపించుకుంటేనే మాకు గౌరవం !

👉 కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం కాదు, స్థానిక సంస్థలలో మన కార్యకర్తలు 90 శాతం విజయం సాధిస్తే ప్రజా పాలన లక్ష్యం నెరవేరుతుంది !

👉 మమ్మల్ని గెలిపించి మీ బాధ్యత నెరవేర్చారు ,  మేము మీకు అండగా ఉండి మిమ్మల్ని ప్రజా ప్రతినిధులుగా గెలిపించుకోవాల్సిన  బాధ్యత మాది !

👉 సమిష్టిగా కష్టపడదాం స్థానిక సంస్థలలో విజయం సాధిద్దాం. కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుద్దాం అని మంత్రి అన్నారు.